
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం పూర్తి..
ఎమ్మెల్సీలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణలో నూతనంగా ఎన్నికయిన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండుస్థానాలు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. రెండో టీచర్స్ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థ్థి గొలుపొందారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది కానీ.. ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోలేక పోయింది.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఐదు స్థానాల్లోని ఎన్నికల నామమాత్రంగానే నిలిచింది. పోటీ లేకపోవడంతో అద్దంకి దాయకర్, విజయశాంతి, దాసోజు శ్రావణ్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు కాకుండా మరో ఆరుగులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ వారి నామినేషన్ పత్రాలు నిబంధనల మేరకు లేకపోవడంతో వాటిని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వారి చేత శాససన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రమాణ స్వీకారం చేశారు.