నిర్మల్, సోమశిల, అహోబిలం గ్రామాలు బెస్ట్ టూరిజం గ్రామాలు, ఎందుకంటే...
తెలంగాణలోని నిర్మల్, సోమశిల, ఏపీలోని అహోబిలంను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించింది.ఉత్తమ గ్రామాల విశిష్ఠత తెలుసుకుందాం.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 2023వ సంవత్సరంలో ఉత్తమ పర్యాటక గ్రామాల మధ్య పోటీని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. సాంస్కృతిక, కమ్యూనిటీ ఆధారిత కళలను సంరక్షించేందుకు వీలుగా పర్యాటక గ్రామాలను ఎంపిక చేశారు.
ఆధ్యాత్మిక గ్రామంగా సోమశిల
ఏపీలో అహోబిలం ఉత్తమ పర్యాటక గ్రామం
అవార్డుల ప్రదానం
ఢిల్లీలో కేంద్రపర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప రాష్ట్రపతి జగ్దీవ్ ధన్కడ్ నుంచి అవార్డులను నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్, ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ పెంటయ్య, సోమశిల పర్యాటక శాఖ అధికారి టి నర్సింహా లు అందుకున్నారు.
మంత్రి జూపల్లి హర్షం
తెలంగాణలోని నిర్మల్, సోమశిల గ్రామాలకు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా అవార్డులు రావడం పట్ల తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు లభించినందుకు నిర్మల్ కళాకారులకు, పర్యాటక శాఖ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. కళలను ప్రోత్సహించడంతోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి టూరిస్ట్ డెస్టినేషన్ గా చేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.