క్యాంపస్ సెలక్షన్స్ లో ‘వరంగల్ నిట్’ రికార్డుల జోరు
x
Warangal NIT

క్యాంపస్ సెలక్షన్స్ లో ‘వరంగల్ నిట్’ రికార్డుల జోరు

వరంగల్ నిట్ లో చదివిన విద్యార్ధులు ప్లేస్ మెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నారు.


ఒకవైపు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే మరోవైపు వరంగల్లోని నిట్ లో చదివిని విద్యార్ధులు ప్లేస్ మెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది నిట్-వరంగల్లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో 1128 మంది విద్యార్ధులను వివిధ ప్రముఖ కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. అదికూడా పెద్ద వేతనాల మీద కొలువులు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. 2023-24 విద్యాసంవత్సరంలో నిట్-వరంగల్లో ఈసీఈలో మంచి మార్కులతో పాసైన్ రవీషా అత్యధికంగా ఏడాదికి రు. 88 లక్షల ప్యాకేజీతో, ఈసీఈ చదవిని మీత్ పొపట్ ఏడాదికి రు. 64 లక్షలతో ఉద్యోగాల్లో చేరారు. ఇంత ఘనంగా ప్యాకేజీలు లేకపోయినా చాలామందికి ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలు వచ్చాయి. తక్కువలో తక్కువ ఏడాదికి రు. 16 లక్షలతో చాలామంది ఉద్యోగాల్లో చేరారు.

ఆకర్షణీయమైన వార్షిక జీతాలతో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్న విద్యార్ధులకు నిట్-వరంగల్ అడ్డాగా మారింది. వరంగల్ నిట్ లో చదవటానికి సీటు దొరికిందంటే చాలు డిగ్రీతో పాటు మంచి జీతంతో పెద్ద ఉద్యోగాలు కూడా గ్యారెంటీ అనే నమ్మకం విద్యార్ధుల్లో పెరిగిపోతోంది. అందుకనే నిట్-వరంగల్లో చదవటానికి విద్యార్దుల మధ్యపోటీ పెరిగిపోతోంది. ఇక్కడ చదివిన విద్యార్ధులకు ఉద్యోగాలు ఇవ్వటంలో ప్రైవేటు సాఫ్ట్ వేర్ కంపెనీలు, మేనేజ్మెంట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగసంస్ధలు కూడా పోటీ పడుతున్నాయి. విద్యార్ధుల చదువు ఇంకా ఏడాది ఉండగానే కంపెనీలు పోటీలు పడి మరీ క్యాంపస్ సెలక్షన్స్ చేసి విద్యార్ధులకు అడ్వాన్సుగా ఉద్యోగాల్లో సెలక్టు చేసుకుని ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చేస్తున్నాయి. అర్ధమయ్యేట్లుగా చెప్పాలంటే థియేటర్లో సీట్లను అడ్వాన్సుగా బుక్ చేసుకున్నట్లే.

నిట్-వరంగల్లో బీటెక్, ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే, ఎమ్మెస్సీ కోర్టుల్లో విద్యార్ధులు ఎక్కువగా చేరుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో డిగ్రీలు అందుకున్న విద్యార్ధుల్లో బీటెక్ లో 82 శాతం, ఎంటెక్ లో 62.3 శాతం, ఎంసీఏలో 82.6 శాతం, ఎమెస్సీలో 80 శాతం, ఎంబీఏలో 76 శాతం మంది విద్యార్ధులకు క్యాంపస్ సెలక్షన్స్ లో మంచి వేతనంతో ఉద్యోగాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలో 1483 మంది విద్యార్ధులు వివిధ కోర్సుల్లో డిగ్రీలు పాసైన వారిలో 1128 మంది క్యాపస్ సెలక్షన్స్ లో పెద్ద జీతాలతో ఉద్యోగాలు అందుకున్నారు. గడచిన నాలుగేళ్ళ రికార్డులను గమనిస్తే క్యాంపస్ సెలక్షన్స్ ట్రాక్ రికార్డు ఏమిటన్నది అర్ధమైపోతుంది.

2020-21 విద్యాసంవత్సరంలో188 కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించాయి. ఇందులో 815 మంది విద్యార్ధులకు ఉద్యోగాలు వచ్చాయి. వీళ్ళలో అత్యధికంగా ఒక విద్యార్ధికి ఏడాదికి రు. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. 2021-22లో 1108 మంది విద్యార్ధులు, 2022-23లో 1404 మంది విద్యార్ధులు క్యాంపస్ సెలక్షన్లో ఉద్యాగాల్లో చేరారు. పోయిన ఏడాది ఉద్యోగాల్లో చేరిన విద్యార్ధుల్లో ఒక విద్యార్ధి అత్యధికంగా రు. 88 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. అలాగే ఈసీఈ పోయిన సంవత్సరం 250 కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తే ఇపుడు 278 కంపెనీలు పాల్గొన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రోడక్ట్ అనాలసిస్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, కన్సల్టెంట్, మేనేజ్మెంట్ చదివిన విద్యార్ధులు ఎక్కువగా క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. నాలుగేళ్ళల్లో 4155 మంది నిట్-వరంగల్ విద్యార్ధులు అత్యధిక జీతాలు అందకుని ఉద్యోగాల్లో చేరారంటేనే దీని ట్రాక్ రికార్డు ఏమిటో తెలిసిపోతోంది.

Read More
Next Story