తెలంగాణ  పల్లెలో దొరికిన నిజాం శాసనం
x

తెలంగాణ పల్లెలో దొరికిన నిజాం శాసనం

గుండారెడ్డిపల్లెలో కనిపించిన మత్తడిపోషమ్మ శాసనం నిజాం పరిపానలకు చెందిన ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడిస్తూ ఉంది.


కొత్త తెలంగాణచరిత్రబృందం పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్ జిల్లా సిద్ధిపేట, మండలం కోహెడ, గుండారెడ్డిపల్లెలో మత్తడిపోషమ్మగుడి దగ్గర నిజాంకాలంనాటి కొత్త శాసనాన్ని గుర్తించారు.

ఈ శాసనం తెలుగుభాషలో,19వ శతాబ్దపు తెలుగులిపిలో ఉన్నది. దీన్ని శ్రీరామోజు హరగోపాల్ చదివి, పరిష్కరించారు. శాసనభాషలో అప్పటి పాలనాభాష ఫార్సీపదాలు చేరివుండడం విశేషం. ఇది చిన్నదే. 16పంక్తుల శాసనమే కాని, నిజాంరాజ్య పరిపాలకులు నీటిపారుదలవ్యవస్థపట్ల చూపిన శ్రద్ధ, బాధ్యతలను కనబరుస్తున్నాయని కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

శాసన వివరణ:

గుండారెడ్డిపల్లె గ్రామంలో ప్రస్తుతమున్న మత్తడిపోచమ్మ దగ్గర ఉన్న ఈ శాసనంలో తేది శక సం.1760, హేవిళంబి నామ సంవత్సర జ్యేష్ట శుద్ద పౌర్ణమి, గురువారం ప్రకారం ఎఫిమెరిస్ కేలండర్ ను బట్టి క్రీ.శ. 1838 మే 7 గురువారమే. ఈ శాసనంలో ప్రభుత్వాధికారి బహాజోయి హకుందెన్ సాహెబు బహాదూర్ జమావం(ద) కొండలరావు గుండారెడ్డిపల్లె చెరువు మత్తడికిచ్చిన ఆయలు(ఆదాయం) హిజ్రీ సం.1246 నుంచి 1250 వరకు చెల్లిన విషయం పేర్కొనబడిందని హరగోపాల్ చెప్పారు.

శాసనపాఠం:

గుండారెడ్డి మత్తడి పోషమ్మ శాసనం

1. శ్రీరామా

2. స్వస్తిశ్రీ జయాభ్యు

3. దయ శాలివాహన

4. శకవర్షంబులు

5. 1760అగునేటి చాంద్రమా

6. న హేవళంబి నామ సంవత్స

7. ర జేష్ట శు.15 గురువారం.....

8. శనగరం చెన్లో...ఉదకుపా(య్యా)

9. కాల్వకు కట్టిన మత్తడివర ఆయా

10. (లు) (మా)రాజువా..దాసు బ(హా)

11. జోయి హకుందెబన్ సాహెబు బ

12. హాదరు జమావంగు కొండల

13. రావు స్వామిచెరాల(స్క)రరు

14. బోనగిరుతయారు చేయించిన

15. ది స్న1246సాలు మతా ఒక

16. స్న1250 హిజరి

Read More
Next Story