
నకిలీ జర్నలిస్ట్ లకు జిహెచ్ఎంసీలో నో ఎంట్రీ?
స్టాండింగ్ కమిటీ నిర్ణయం
హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో జర్నలిస్ట్ లు ముసుగులో వచ్చే నకిలీ జర్నలిస్ట్ లను కట్టడి చేయాలని జిహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై స్టాండింగ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలు సమావేశమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈ అంశంపై సీరియస్ గా తీసుకున్నారు. మీడియా ముసుగులో నకిలీ జర్నలిస్ట్ లు వచ్చి గంటల తరబడి కూర్చోవడం వల్ల అధికారులు సరిగ్గా విధులు నిర్వహించలేకపోతున్నారని ఆర్వీకర్ణన్ కు ఫిర్యాదులు అందాయి. జర్నలిస్టుల ముసుగులో కొందరు అధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్టు కమిషనర్ దృష్టికి వచ్చినట్టు తెలిసింది.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో నకిలీ జర్నలిస్ట్ లు రాకుండా స్టాండింగ్ కమిటీ అనేక పర్యాయాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. చర్చల సారాంశం ప్రకారం నకిలీ జర్నలిస్ట్ లను జిహెచ్ఎంసీ కార్యాలయంలో అనుమతించకూడదని నిర్ణయించారు. అయితే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డు ఉన్నట్లయితే వారానికి ఒక సారి అనుమతివ్వాలని నిర్ణయించినట్టు స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.