స్థానిక ఎన్నికల్లో ‘నోటా’.. పార్టీల రియాక్షన్ ఇదే
x

స్థానిక ఎన్నికల్లో ‘నోటా’.. పార్టీల రియాక్షన్ ఇదే

నోటా గెలిస్తే రీ-ఎలక్షన్. తిరస్కరించిన కాంగ్రెస్. నోటా పక్కా అన్న జనసేన. ఇంకా ఎవరేమన్నారంటే.


తెలంగాణ అంతటా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడీ మొదలైపోయింది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. అతి త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో బుధవారం.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమయింది. ఈ సమావేశంలో ఏకగ్రీవం ప్రక్రియ లేకుండా ఎన్నికల నిర్వహణపై భేటీ అయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా పెట్టాలన్న తమ అభిప్రాయంపై రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ, ఓటర్ లిస్ట్ సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇందులో స్థానిక సంస్థల్లో కూడా నోటా పెట్టాలన్న తమ వాదనను ఎన్నికల సంఘం వినిపించింది. ఈ మేరకు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. నోటా ఎలా పనిచేస్తుంది అన్న అంశాలపై వివరణ ఇచ్చింది.

నోటాపై ఈసీ ప్రతిపాదనలు..

1. ఎన్నికల ఫలితాలను ప్రకటించేటప్పుడు నోటాను ఒక ‘కల్పిత అభ్యర్థి’గా పరిగణించబడుతుంది.

2. ఎన్నికల్లో నోటాకు, పోటీ చేస్తున్న అభ్యర్థికి సమాన ఓట్లు వస్తే సదరు పోటీ అభ్యర్థిని విజేతగా ప్రకటించబడుతుంది.

3.ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తే ఎవరూ గెలవనట్లు వెల్లడించబడుతుంది.

4. ఎన్నికలో ఓటాకు అత్యధిక ఓట్లు వచ్చినట్లయితే ఆ ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది.


5. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు మళ్ళీ పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారు.

6. రీఎలక్షన్‌లో కూడా నోటాకే అత్యధిక ఓట్లు వస్తే రెండో అభ్యర్థుల్లో అధిక ఓట్లు వచ్చిన వారిని విజేతగా వెల్లడించడం జరుగుతుంది.

కాగా ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనలపై పార్టీలు తీవ్రంగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ఉంచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నోటాతో ఎన్నిక అనేది ఖర్చుతో కూడుకున్న పని అని కాంగ్రస్ పేర్కింది. కాగా బీఆర్ఎస్ మాత్రం నోటాతో ఎన్నికకు మద్దతు పలికింది. ఈ విషయాలు ఆ పార్టీ వెల్లడించింది. ‘‘ఈసీ.. నోటాపై అభిప్రాయం సేకరించారు. ఏకగ్రీవానికి బెదిరింపులు, బలప్రదరశన చేసే అవకాశం ఉంది. అందుకే నోటాతో ఎన్నికకు మేము సమర్థించాం. కాగా కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరాం’’ అని బీఆర్ఎస్ తెలిపింది.

బీజేపీ నేతలు మాత్రం ఈ నిర్ణయంపై ఇప్పుడే తమ అభిప్రాయం చెప్పలేమన్నారు. ‘‘నోటాపై మా అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ అడిగింది. కాగా నోటా అనేది సుప్రీంకోర్టులో ఉన్న అంశం కావున ఇప్పుడు అభిప్రాయం చెప్పలేమని చెప్పాం. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేదు. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి’’ అని పేర్కొంది.

‘‘నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తె రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ’’ అని సీపీఎం పేర్కొంది. తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామని టిటీడీపీ తెలిపింది. సింగల్ కాండిడేట్ ఉన్నా నోటా ఉండాలని జనసేనా పార్టీ పేర్కొంది.

Read More
Next Story