ఎంఎల్ఏలకు న్యూడ్ కాల్స్
x
Nude call to MLA Vemula Veeresam

ఎంఎల్ఏలకు న్యూడ్ కాల్స్

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల సందర్భంగా కొందరు ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మధ్య లాబీలో చర్చజరిగింది.


రాష్ట్రంలో కలకలం సృష్టించిన న్యూడ్ కాల్స్ పై అసెంబ్లీలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మధ్య చర్చజరిగినట్లు సమాచారం. ఆమధ్య నల్గొండ జిల్లా నకిరేకల్ ఎంఎల్ఏ వేముల వీరేశంకు న్యూడ్ కాల్ రావటం తెలంగాణలో సంచలనం సృష్టించింది. తనకు వాట్సప్ వీడియో కాల్ రావటంతో ఎంఎల్ఏ అటెండ్ అయ్యారు. వెంటనే అవతలివైపు ఒక అమ్మాయి న్యూడ్ గా కనిపించటంతో వీరేశంకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లయ్యింది. వెంటనే తన మొబైల్ ఫోన్ను ఆఫ్ చేయటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయంపై తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాల సందర్భంగా కొందరు ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మధ్య లాబీలో చర్చజరిగింది.

ఇంతకీ విషయం ఏమిటంటే వీరేశంకు వచ్చినట్లుగానే మరో ఐదుమంది ప్రజాప్రతినిధులకు కూడా న్యూడ్ కాల్స్(Nude calls) వచ్చినట్లు తెలిసింది. తమకు నేహాశర్మ పేరుతో ఒక న్యూడ్ కాల్ వచ్చినట్లు కొందరు ప్రజాప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. వీరేశం కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎంఎల్ఏ, ఓ ఎంఎల్సీ, వరంగల్ జిల్లాకు చెందిన మరో ఎంఎల్సీ, మెదక్ జిల్లాలోని ఒక ఎంఎల్ఏకు కూడా న్యూడ్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. న్యూడ్ కాల్స్ ను అందుకున్న ప్రజాప్రతినిధులు తమ పేర్లు బహిర్గతం అవటానికి ఇష్టపడలేదు. అందుకనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అయితే తాము న్యూడ్ కాల్స్ అందుకున్నట్లుగా వీరు పోలీసు ఉన్నతాధికారులకు నోటిమాటగా చెప్పినట్లు సమాచారం.

ఈమధ్యకాలంలో నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. హఠాత్తుగా ఎవరికో వీడియో కాల్(Nude Video Call) వస్తుంది. కాల్ కు ఆన్సర్ చేయగానే న్యూడ్ కాల్ లో ఒక అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. హొయలుపోతు, వగలు కురిపిస్తు ఫోన్ అందుకున్న వ్యక్తిని ముగ్గులోకి దింపుతుంది. ఆ మాయలో గనుక పడితే తర్వాత అంతే సంగతులు. న్యూడ్ కాల్ కదాని టెంప్ట్ అయిన వ్యక్తి అదేపనిగా మాట్లాడితే రెండురకాలుగా ఇబ్బందుల్లో పడినట్లే. మొదటిరకం ఎలాగంటే న్యూడ్ కాల్ లో యువతి కనబడుతునే టార్గెట్ వ్యక్తిని పూర్తిగా రికార్డు చేస్తుంది. అంటే సదరు వ్యక్తి న్యూడ్ కాల్లో యువతితో మాట్లాడుతున్న వీడియో ఆటోమేటిక్కుగా రికార్డయిపోతుంది.

ఇక రెండో రకమైన ఇబ్బంది ఏమిటంటే టార్గెట్ వ్యక్తి బట్టలను మొత్తం తీసేసి న్యూడ్ గా తయారుచేసిన తర్వాత సదరు రెండు వీడియోలను టార్గెట్ వ్యక్తికి పంపుతారు. ఇలాంటి వాటికోసం ఈ ముఠాలె అత్యాధునిక సాఫ్ట్ వేర్లను వాడుతుంటారు. అప్పటినుండి బ్లాక్ మెయిల్ పర్వం మొదలవుతుంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా లేదా అడిగినప్పుడల్లా ఇవ్వకపోయినా అంతేసంగతులు. టార్గెట్ మాట్లాడిన న్యూడ్ కాల్ లేదా న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారు. పరువుపోతుందన్న భయంతోనే టార్గెట్ వ్యక్తులు మాఫియా అడిగినంత డబ్బులు సమర్పించుకుంటుంటారు. ఇలాంటి సైబర్ ముఠాల దెబ్బకు రోజూ ఎంతోమంది బలవుతునే ఉంటారు. కాకపోతే ఎంఎల్ఏలకు కూడా ఇలాంటి న్యూడ్ కాల్స్ రావటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏలను టార్గెట్ చేసుకుని ఈ మాఫియా న్యూడ్ కాల్స్ చేస్తున్నారా ? లేకపోతే తాము ర్యాండంగా చేస్తున్న మొబైల్ నెంబర్లలో ఎంఎల్ఏల నెంబర్లు కూడా ఉంటున్నాయా అన్నదే అర్ధంకావటంలేదు.

అరెస్టయిన న్యూడ్ కాల్స్ నిందితులు

వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన ముఠాలోని సభ్యులను నల్గొండ పోలీసులు అరెస్టుచేశారు. ఎంఎల్ఏ ఫిర్యాదుతో కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తుచేసిన పోలీసులు ముఠాసభ్యులు మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. నల్గొండ నుండి మధ్యప్రదేశ్(Madhya Pradesh) కు వెళ్ళిన పోలీసు బృందం అక్కడి పోలీసులకు సమాచరం ఇచ్చి సాయం తీసుకున్నారు. దాంతో ఆ రాష్ట్రంలో నెంబర్ ఆధారంగా అడ్రస్ పట్టుకుని ముఠాలోని సభ్యులను అరెస్టుచేసి నల్గొండకు తీసుకొచ్చారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

న్యూడ్ కాల్స్ నుండి తప్పించుకోవాలంటే అలాంటి కాల్స్ ను ఆన్సర్ చేయకపోవటమే ఉత్తమం. ఒకవేళ యథాలాపంగా ఆన్స్ చేసినా వెంటనే కాల్ ను కట్ చేయాలి. లేదంటే ఫ్రంట్ కెమెరాను చేతితో మూసేసిన వెంటనే కాల్ ను కట్ చేయచ్చు. ఫ్రంట్ కెమెరాను చేతితో మూసేయటం వల్ల ఏమవుతుందంటే టార్గెట్ వ్యక్తి మొహం అవతలి ముఠాకు కనబడదు. నిజానికి ఈ జాగ్రత్త తీసుకునేబదులు న్యూడ్ కాలని గ్రహించగానే వెంటనే ఫోన్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదుచేయటమే మంచిది.

Read More
Next Story