
SLBCకి చేరుకున్న క్యాడవర్ డాగ్స్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా!
రెస్క్యూ డాగ్స్, క్యాడవర్ డాగ్స్‌కు ఇదే తేడా.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాలను గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను తీసుకొచ్చారు అధికారులు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లలో వీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎస్‌ఎల్‌బీసీకి చేరుకుంటూనే క్యాడవర్ డాగ్స్.. డ్యూటీ ఎక్కేశాయి. వాటిని రెస్క్యూ టీమ్స్ టన్నెల్‌లోకి తీసుకెల్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో పాటు సింగరేరణి, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కూడా టన్నెల్‌లోకి వెళ్లాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీప్ సెక్రటరీ అరవింద్ కుమార్.. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. క్యాడవర్ డాగ్స్‌తో పాటు రెస్క్యూ ఆపరేషన్‌లో రోబోలు కూడా పాల్గొన్నాయి.
రెస్క్యూ ఆపరేషన్స్‌లో భాగంగా మృతదేహాలను గుర్తించడం కోసం మార్క్ చేసిన ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు అధికారులు. డీవాటరింగ్ చర్యలు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ మొరాయించడంతో మట్టి తవ్వకాలకు మళ్ళీ బ్రేకులు పడ్డాయి. రోబోల వినియోగం సాధ్యమవుతుందా అన్న అంశంపై అధికారులు చర్చలు చేస్తున్నారు. రోబోలను వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో అక్కడి పరిస్థితులపై అధికారులు మరోసారి సమీక్షిస్తున్నారు.
క్యాడవర్ డాగ్స్ అంటే ఏంటి..!
పోలీసులు, ఆర్మీ వంటి భద్రతా బృందాల్లో పనిచేసే కెనైన్ డాగ్స్ వంటి ఒక బాధ్యతాయుతమైన పనిలో ఉండేవే ఈ క్యాడవర్ డాగ్స్ కూడా. ఇవి ముఖ్యంగా గల్లంతైన, మిస్టరీగా మారిన మరణాలు వంటి కేసులను సాల్వ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వ్యక్తుల వాసనను పసిగట్టడానికి శిక్ష అందుకుంటాయి. క్యాడవర్ డాగ్స్ చేసే పని కూడా దాదాపు రెస్క్యూ డాగ్స్ చేసే పనిలానే ఉంటుంది. కానీ క్యాడవర్ డాగ్స్ చేసే పని పూర్తిగా వేరే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాధారణంగా సెర్చ్ డాగ్స్ అనేవి వ్యక్తుల నుంచి వచ్చే సాధారణ వాసనలను పసిగట్టడానికి శిక్షణ పొందితే.. ఈ క్యాడవర్ డాగ్స్ మాత్రం ముఖ్యంగా శరీరం కుళ్లిపోయే సమయంలో వచ్చే వాసనను పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందుతాయి. కుళ్లిపోతున్న మృతదేహం వాసనను పసిగట్టడంలో ఈ క్యాడవర్ డాగ్స్ 95శాతం పాజిటివ్ రిజల్ట్స్‌ను అందిస్తాయి. భూమిలో 15 అడుగుల కింద పాతిపెట్టబడిన దేహాల వాసనను కూడా ఇవి పసిగట్టగలవు.
మృతదేహం ప్రధాన ఆధారంగా మారిన నేరాలను పరిష్కరించడానికి భద్రతా బలగాలు ఈ క్యాడవర్ డాగ్స్‌ను వినియోగిస్తాయి. వీటినే ఇప్పుడు ఎస్ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్స్‌లో వినియోగిస్తున్నారు. ఈ డాగ్స్ ద్వారా బురదలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించాలని అధికారులు భావిస్తున్నారు. మరి వారు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.