సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చేసిన అధికారులు
x

సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చేసిన అధికారులు

కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా నిలిచిన రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడ


గ్రామంలో రొడ్డు విస్తరణ పనులైనా , పట్టణంలో పనులైనా ఏ చోటా లీడర్ దైనా ఇంటి గోడ అడ్డు వస్తుంటే అధికారులు చేతు లెత్తేస్తారు.అటు పక్క చూడకుండా తమ పనులు కానిచ్చేస్తుంటారు. నిజాయితీగా ఎవరైనా ముందుకు వెళ్లతామంటే వార్నింగులు తప్పవు.అలాంటిది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో అధికారులు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఏకంగా సీఎం ఇంటి ప్రహరీ గోడనే కూలగొట్టారు. అధికారులు ఎలాంటి బెరుకూ లేకుండా ముఖ్యమంత్రి ఇంటి ప్రహరీ కూల్చడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్గించింది.అయితే అధికారులు చేస్తున్న పనిని అడ్డుకోకుండా ,అడిగిన వెంటనే గోడ కూల్చడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ వైఖరి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి తన ఇంటి విషయంలో చూపించిన చొరవను అధికారులు ,స్థానికులు మెచ్చు కుంటున్నారు.తన ఇంటి గోడ ముఖ్యంకాదు , గ్రామం అభివృద్ది ముఖ్యమంటూ, అందరికీ ఒకే రూల్ చందంగా వ్యవహరించిన తీరు ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు వున్న నిబద్ధతను చాటుతోందని చర్చలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడను కూలుస్తున్న ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు "నిజమైన నాయకుడు అంటే ఇలాగే ఉండాలి," అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ప్రజా ప్రయోజనాల కోసం తన వ్యక్తిగత ఆస్తులను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడడం గ్రేట్ అని కొనియాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లోనూ విజువల్స్ వైరల్ చేస్తూ ఇదీ మా సీఎం నిబద్దత అని చెప్పు కొంటోంది.పాలనలో పారదర్శకత వుంటే ప్రజలు ఎప్పుడు జేజేలు పలుకుతారు. అందుకే ఇది చిన్న సంఘటన అయినా వీడియో వైరల్ గా మారింది.
Read More
Next Story