
SLBC టన్నెల్‌లో కనిపించిన చెయ్యి..!
ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డీ-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యల్లో కీలక పురోగతి లభించింది. లోపల గల్లంతయిన వారిలో ఒకరి చేయి కనిపించింది. దీంతో ఆ మృతదేహాన్ని వెలికి తీసయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చుట్టూ ఉన్న బురద, నీటిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతన్నాయి. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలుసుకోవడం సహాయక బృందాలు, అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు అధికారులు. మృతదేహాల నుంచి వచ్చే వాసనను పసిగట్టడంలో ఈ క్యాడవర్ డాగ్స్‌ను ప్రత్యేక శిక్షణ పొందుంటాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డీ-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని ఆదివారం సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందని సమాచారం.
సొరంగంలో గల్లంతయినా వారి ఆచూకీ కోసం దాదాపు పది రెస్క్యూ బృందాలు రాత్రంబవల్లు శ్రమించాయి. తాజాగా వారిని ఆచూకీ తెలిసినట్లు తెలుస్తోంది. కేరళ జాగిలాలు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు కూడా ప్రారంభించారు అధికారులు. డీ2 ప్రాంతంలో 6అడుగుల లోతు తవ్వగా అక్కడ ఒక కార్మికుడి కుడి చేయి కనిపించినట్లు సమాచారం. ఆ మృతదేహాన్ని వెలికి తీయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే ప్రాంతంలో మరో మృతదేహం కూడా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అధికారులు.