
మూసీ ప్రాజెక్టులో క్రస్ట్ గేట్లు ఎత్తేసిన అధికారులు
నల్గొండ, సూర్యపేట జిల్లాల రైతులు అప్రమత్తం
తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరడంతో శుక్రవారం గేట్లను ఎత్తివేసారు. మూసీ ప్రాజెక్టు ప్రస్తుతం మూడు క్రస్ట్ గేట్లు గేట్లు తెరచుకున్నాయి. దిగువకు వరదనీరు వదిలారు. మూడో, ఎనిమిదో గేటును వదిలేయడంతో 1293 క్యూసెక్కుల నీరు విడుదలౌతుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరింది. మూసీ ప్రాజెక్టుకు 1427 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 645 అడుగులు(4.46 టిఎంసీలు).
కాగా 643.20 అడుగులకు నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై దిగువకు నీటిని వదిలారు. ఆయకట్టులో పంట సాగుకు కుడి ప్రధాన కాల్వలో 143 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 214. 86 క్యూసెక్కుల నీరు వదిలారు.
నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో మూసీ తీర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని మూసీ ప్రాజెక్టు అధికారులు హెచ్చరించారు.