తెలంగాణ  వాన లెక్కల్లో గమ్మత్తు...
x
Representational picture

తెలంగాణ వాన లెక్కల్లో గమ్మత్తు...

వాతావరణ శాఖ లెక్కల్లో తెలంగాణలో ఫుల్ గా వానలొచ్చాయి. కాని...భూమ్మీద ఆలెక్కలు తప్పుతున్నాయి. ఎలాగంటే...


ఖమ్మం జిల్లా వరదలు చూశాక తెలంగాణ మొత్తం అతలాకుతలమయిందనుకుంటారెవరైనా. ఒక విధంగా ఇది కరెక్టే . ఎందుకంటే రాష్ట్రంలోని ౩౩ జిల్లాల్లో 31 జిల్లాల్లో అధికంగా, అత్యధికంగా వర్ష పాతం నమోదయింది. దీనితో చెరువులు కుంటలు నిండిపొర్లిపోతుంటాయనుకుంటారు. కాని అలా జరగలే. తెలంగాణలో 35 శాతం చెరువులు నిండలేదు. అదే విచిత్రం. అంటే, వర్షాలు రాష్ట్రమంతా సమానంగా పడలేదని అర్థం. దానితో అత్యధిక వర్షపాత రాష్ట్రంగా తెలంగాణని వాతావరణ శాఖ వర్ణించినా, చెరువులు నిండని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ లెక్కలేంటో చూద్దాం.

రాష్ట్రంలో 34,716 నీటిపారుదల చెరువులున్నాయి. వాటిలో నిండినవి దాదాపు 65 శాతమే.

ఇందులో 6000 చెరువులు కనీసం 50 శాతం కూడా నిండలేదు. వీటిలో 2200 చెరువులు 25 శాతం మించి నీల్లు రాలేదు.

హైదరాబాద్ నీటిపారుదల సర్కిల్ లో(రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి) 2599 చెరువులున్నాయి. వీటిలో 40 శాతం చెరువులునిండనేలేదు.

హైదరాబాద్ లో శేరిలింగంపల్లి, కొండాపూర్,మాదాపూర్, గచ్చిబౌళిలలో జోరుగా వర్షాలు కురిసినా ఎల్ బి నగర్, మేడ్చల్ ప్రాంతాలలో వర్షాలు ఆశించిన మేర లేవు.

ఇదే అసమాన వర్షాలు జిల్లాల్లో కూడా కనిపిస్తాయి.

ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లా వాతావరణ లెక్కల ప్రకారం అత్యధిక వర్షం పాతం అందుకుంది. జిల్లా వార్షిక వర్షపాతం కేవలం 374 మి.మీమాత్రమే, కురిసింది మాత్రం 734 మి.మీ. జిల్లాల్లో 400 చెరువులున్నాయి. వీటిలోకి 50శాతం కూడా నీళ్లు రాలేదని అధికారులు చెబుతున్నారు.

నల్గొండ జిల్లాలో 1628 చెరువులున్నాయి. ఇందులో కనీసం వేయి చెరువుల్లో నీళ్లు 50 శాతం కూడా లేవు. 124 చెరువులు నిండాయి. 144 చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

భద్రాద్రి కొత్త గూడెంజిల్లాకు ఫుల్ గా వర్షాలొచ్చాయి. ఈ జిల్లాలో 2140 ట్యాంకులున్నాయి. ఇందులో నిండి పొర్లుతున్నవి 1800. అంటే 340 చెరువులు ఇంకా నిండాల్సి ఉంది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం,జూన్ 1 నుంచి సెప్టెంబర్ 4 వ తేదీ కా తెలంగాణలో 597 మి.మీ వర్షపాతం రావాలి. ఇది నార్మల్ రెయిన్ ఫాల్. అయింతే, రాష్ట్రంలో 836మి.మీ వాన కురిసింది. అంటే 40 శాతం ఎక్కువగా వానలచ్చాయి. ఈ కాలంలో 90 రోజులు వానలుకురవాయి. అయితే, ఈ సారి కురిసింది 73 రోజులే.

Read More
Next Story