
తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. వడగళ్ల వర్షం కురిసే సమయంలో మాత్రం బయటకు ఎట్టిపరిస్థితుల్లో వెళ్లొద్దని సూచించారు అధికారులు.
తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే దాదాపు 21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే అవకావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జాల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగి పడే అవకాశాలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రావొచ్చని అధికారులు చెప్తున్నారు.
మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో వాతావరణం మరింత దారుణంగా ఉండనుందని హెచ్చరిస్తున్న వాతావరణ అధికారులు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకావం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండగా, సాయంత్రం సమయంలో పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. పిడుగులు కూడా పడుతున్నాయని, ఇలాంటి సమయాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు కురుసే సమయంలో ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. వడగళ్ల వర్షం కురిసే సమయంలో మాత్రం బయటకు ఎట్టిపరిస్థితుల్లో వెళ్లొద్దని సూచించారు అధికారులు.