తెలంగాణకి రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్
x

తెలంగాణకి రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణాలో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


తెలంగాణాలో నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, 40 కి.మీ. నుంచి 50 కి.మీ వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఇక భారత వాతావరణ శాఖ కూడా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందించింది. దక్షిణ భారతదేశంలో గురువారం (ఈరోజు) నుంచి ఆరు రోజులపాటు వర్షాలు ఉంటాయని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వెల్లడించింది.

అలాగే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు మే 31 న కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ తెలియజేసింది. జూన్ ఒకటిన కేరళకి వచ్చే రుతుపవనాలు ఒక్కరోజు ముందే రానున్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా వెల్లడించారు. ఖరీఫ్ ఎక్కువగా సాగే జూన్, జులై లలో వర్షాలు సాధారణానికి మించి ఉంటాయని రైతులకు తీపి కబురు చెప్పారు.

Read More
Next Story