ORR TOLL TENDER | ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండరుపై విచారణకు సిట్
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండరుపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశిస్తున్నట్లు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు.మంత్రివర్గం విధివిధానాలను ఖరారు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.ఒక వైపు ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదైంది.
- మరో వైపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ వ్యవహారంలోనూ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండరు వ్యవహారంలో అక్రమాలపై ఆరోపణలు చేశారు. అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ రేవంత్ ఆరోపణలను ఖండించారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ సర్కారు దీనిపై విచారణకు ఆదేశించడం సంచలనం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై హరీష్ రావు కోరిక మేరకు విచారణకు ఆదేశించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ టెండర్లపై చాలా రోజులుగా చర్చ నడుస్తోందని, అప్పులు తీసుకుని ఓఆర్ఆర్ నిర్మించుకున్నామని సీఎం చెప్పారు.హరీష్ రావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు.ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్టుపై స్పెషల్ ఇన్ వెస్టిగేటివ్ టీమ్ ను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
Next Story