‘వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి’
x

‘వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి’

వరంగల్‌ను నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


వరంగల్‌ను నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇటీవల వరంగల్ పర్యటనలో కూడా నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులతో సమీక్షలు నిర్వహించారని చెప్పారు. దాంతో పాటుగానే అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపధ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ , భ‌ద్ర‌కాళి చెరువు, విమానాశ్ర‌యం తదితర అంశాలపై ప్ర‌ధానంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌ భ‌ద్ర‌కాళి చెరువు శుద్దీక‌ర‌ణ‌ప‌నుల‌ను వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ప్రాధాన్య‌త క్రమంలో ప‌నుల‌ను చేప‌ట్టి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Read More
Next Story