‘ఫార్మా రైతుల నామినేషన్ ల తిరస్కరణ ఒక కుట్ర’
x

‘ఫార్మా రైతుల నామినేషన్ ల తిరస్కరణ ఒక కుట్ర’

రాహుల్ గాంధీ తాను రాజ్యాంగాన్ని రక్షిస్తాను అంటుంటే వాళ్ల ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తోంది


తమ సమస్యలను వెలుగు లోకి తెచ్చి ప్రచారం చేసుకోవటానికి రైతులు గా తమకు వున్న హక్కులో భాగంగా జూబ్లీ హీల్స్ అసెంబ్లీ బై ఎలెక్షన్ లలో పోటీచేస్తుంటే తమ వారి నామినేషన్లు కుట్ర పూరితంగా తిరస్కరించారని ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆరోపించింది. యిది ఫార్మా సిటీ రద్దు పైన తమ 2023 ఎన్నికల మనిఫెస్టో లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే అన్నారు.

తమ భూములను ఆన్లైన్ లో ఎక్కించి అన్ని హక్కులు కల్పిస్తామని ఆ హామీని నిలబెట్టు కోలేదని వారు ఆ ప్రకటనలో ఆరోపించారు. పోలీసులని పెట్టించి తమ భూములు గుంజుకుoటున్న వాస్తవాలు మొత్తం తెలంగాణ ప్రజలకి తెలియచేయ్యాలని, ఫార్మా రైతులు జూబిలీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో నామినేషన్ వేసే ప్రయత్నం చేశామని వారు చెప్పారు. యిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రగా వారు అభివర్ణించారు.

మా వాళ్ళు నామినేషన్ వేయకుండా కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అనేక అడ్డంకులు సృష్టించింది. పోటీచేస్తున్న అభ్యర్థులు జూబ్లీ హీల్స్ అసెంబ్లీ నియోజక వర్గం లో స్థానికులు కాదు కాబట్టి వాళ్ళ సర్టిఫైడ్ ఎలక్టోరల్ రోల్స్ వాళ్ళు ఎలెక్షన్ అఫిడవిట్ లో చేర్చటానికి అడిగితే అవి ఇయ్యటానికి ఇబ్రహీంపట్నం RDO ఆఫీస్ కు వెళ్తే అక్కడ దాని చుట్టు 4 రోజులు తిప్పించుకున్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, సర్టిఫికెట్ ఇచ్చేశానని వారికి అబద్దం చెప్పారు. చివరికి సర్టిఫికెట్ ఇచ్చేదాక మీ ఆఫీస్ నుంచి కదిలేదు లేదని రైతులు తేల్చి చెప్పాడంతో చేసేది లేక ఇచ్చారని పోరాట కమిటీ సభ్యురాలు కవుల సరస్వతి ఫెడరల్ తో చెప్పారు.

రైతులు 21-10-2025 తేదిన నామినేషన్ వేస్తే ఫార్మా రైతులు పోటీలో ఉంటే ప్రభుత్వానికి నెగటివ్ ప్రచారం జరుగుతుందని, మొత్తం ఫార్మా రైతుల నామినేషన్స్ ని తిరస్కరించారు. అందుకు కారణాలు ఆడగగా ఇచ్చిన అఫిడవిట్ లో "బ్లాంక్స్" అంటే ఖాళీలు ఉన్నాయి అని చెప్పారు. అఫిడవిట్ లో నాలుగు కాలమ్స్ ఉంటే ఒక కాలమ్ లో రాసిన మేటర్ ఎక్కువగా ఉండి పక్క పేజీలో ఆ కాలమ్ లో మేటర్ ఉండి, మిగతా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇది సమాచారం కొనసాగింపు తప్ప ఖాళీలు కావు. అదే విధమైన ఖాళీలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇచ్చిన 4 అఫిడవిట్స్ లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఫిడవిట్స్ లో వున్నా వాటిని అంగీకరించారు. చివరికి దీపక్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ ఒక దాంట్లో అయితే ఆయన ఫోటో కూడా లేకపోయినా తీసుకున్నారు కానీ ఖాళీలు వున్నాయి అనే పేరుతో ఫార్మా రైతుల నామినేషన్ లు మాత్రమే తిరస్కరించారు. ఇదే కారణం చెప్పి RRR రైతుల నామినేషన్స్ అన్ని నిరాకరించారు. ఇది ఖచ్చితంగా కుట్ర పూరితంగా జరిగిందే అని ఆ ప్రకటన స్పస్టం చేసింది.




రైతులను భయ పెట్టేందుకు వాళ్ల గురించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వయిరీ పేరుతో ప్రయత్నించారు. వాళ్ళు జూబ్లీ హీల్స్ లో నామినేషన్ వేస్తుంటే ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.వీ.పి. రాజు అక్కడికి వచ్చారు. అక్కడి ఎన్నికలకు ఆయనకు ఏమి సంబంధం. మా అభ్యర్థికి సంభందించిన బంధువు ఫోన్ చేసి తాను ఎందుకు పోటీ చేస్తున్నారని ఏసీపీ అదడిగినట్టు వాకబు చేశారు. రైతులు హైదరాబాద్ లో నామినేషన్ రోజు ర్యాలీ చేయటం తో విషయం బాగా ప్రచారం అయ్యింది. యింటింటికి తిరిగి కాంగ్రెస్ చేసిన మోసన్ని చెప్తా మనీ వారు చెప్పటం మీడియా లో వచ్చింది, అని సరస్వతి చెప్పారు. ఈ విషయం గురించి మేము జనరల్ అబ్సర్వర్ గారికి, అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమీషనర్, న్యూ ఢిల్లీ గారికి ఫిర్యాదు చేసామని ఆమె అన్నారు. వేరే స్వాతంత్ర్య అభ్యర్థుల పత్రాలను యివే సమస్యలు ఉన్న వాటిని అంగీకరించారు.

ఒక పక్క రాహుల్ గాంధీ నేను రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ప్రజా స్వామ్యాన్ని రక్షిస్తాను అని అంటారు. కానీ వాళ్ళ ప్రభుత్వమే రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు అని ఆమె వాపోయారు.

Read More
Next Story