అదుపు తప్పిన  ఆటో బావిలో పడింది
x

అదుపు తప్పిన ఆటో బావిలో పడింది

ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఒకరు మృతి, ఇద్దరు పరిస్థితి విషమం


మితి మీరిన వేగంగా వెళ్లిన ఆటో అదుపు తప్పి బావిలో పడిపోయింది. మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెల్లికుదురు మండలం మునిగల వేడులో అదుపు తప్పిన ఓ ఆటో రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇద్దరు మితిమీరిన వేగంతో వెళ్లిన ఆటో బావిలో పడటంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మహబూబాబాద్ జిల్లాలో చోటు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బావి పడ్డ ఆటోను వెలికితీశారు.

మితి మీరిన వేగంతో ప్రయాణించడం వల్లే డ్రైవర్ ఆటోను కంట్రోల్ చేయలేకపోయాడని, రోడ్డు పక్కన బావి ఉందని గుర్తించకపోవడంతో నేరుగా బావిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.

ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శ్రీరామ్ ప్రాణాలు కోల్పోగా ఆయన భార్య భారతమ్మ, కొడుకు మార్కండేయ పరిస్థితి విషమంగా ఉంది.

Read More
Next Story