
మొదలైన పంచాయితీ పోలింగ్
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది.
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదటిదశ గురువారం మొదలైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత అంటే 2 గంగలకు కౌంటింగ్ మొదలవుతుంది. మొదటిదశలో 3834 సర్పంచ్ పదవులతో పాటు 27,678 వార్డుసభ్యులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నిక జరుగుతోంది.
పోలింగ్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం 50 వేలమంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు చేసింది. సర్పంచ్ పదవులకు 12,960 మంది పోటీపడుతున్నారు. 890 పంచాయితీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ప్రకటించిన విషయం తెలిసిందే. 37,562 పోలింగ్ కేంద్రాలను ఎన్నికలసంఘం ఏర్పాటుచేసింది.
పంచాయితీ ఎన్నికలకు కూడా గతంలో ఎప్పుడూ లేనట్లుగా తీవ్రస్ధాయిలో పోటీ జరిగింది. నిజానికి సర్పంచ్ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతున్నా, పార్టీల సీనియర్ నేతలు లేదా పార్టీల మద్దతుతోనే నేతలు పోటీలోకి దిగటంతో చాలా పంచాయితీల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకం మారిపోయాయి. ఒకవైపు చలిపులి వణికించేస్తున్నప్పటికీ ఓటర్లు కూడా తెల్లవారే పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

