తెలంగాణాకు పవన్ కోటి విరాళం
తెలంగాణా వరద బాధితుల సహాయార్ధం ప్రముఖ సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోటిరూపాయలు విరాళం అందించారు.
తెలంగాణా వరద బాధితుల సహాయార్ధం ప్రముఖ సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోటిరూపాయలు విరాళం అందించారు. బుధవారం ఉదయం రేవంత్ రెడ్డిని కలిసిన పవన్ కోటి రూపాయల విరాళం చెక్కును అందించారు. ఏపీ వరదబాధితుల సహాయార్ధం కూడా పవన్ భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ నాలుగురోజుల క్రితమే రు. 6 కోట్లను విరాళంగా అందించారు. ఈరోజు రేవంత్ ను కలిసి మరో కోటిరూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిదికి అందించారు.
మొత్తంమీద వరదబాధితుల సహాయార్ధం ఇంతపెద్దమొత్తాన్ని విరాళంగా అందించిన పవన్ను అభినందించాల్సిందే. ఎందుకు అభినందించాలంటే ఏపీ ప్రభుత్వంలో పవన్ కీలకపాత్ర పోషిస్తు కూడా తెలంగాణాలో ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చినందుకు. నిజానికి ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వారు కూడా మరో ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాదులోనే ఉంటున్న చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి చాలామంది ఏపీ రాజకీయ ప్రముఖులు తెలంగాణా ముఖ్యమంత్రి సహాయనిదికి విరాళాలు ప్రకటించలేదు.
అలాంటిది పవన్ విరాళం ప్రకటించటం విశేషమనే చెప్పాలి. పవన్ తో పాటు చాలామంది ఏపీ రాజకీయ ప్రముఖులకు హైదరాబాద్ లో ఆస్తులు, వ్యాపారాలున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా చాలామంది తెలంగాణాలో వరద బాధితులకు ఇచ్చిన విరాళం ఏమీలేదు. అందుకనే ఈ విషయంలో పవన్ను అభినందిస్తున్నది. కొంతమంది సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మాత్రం రెండు తెలుగురాష్ట్రాలకు విరాళాన్ని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉంటు తెలంగాణాకు కూడా భారీ విరాళాన్ని ప్రకటించిన సినీ, రాజకీయ ప్రముఖుడు మాత్రం పవన్ కల్యాణ్ ఒక్కడేనేమో.