కాళేశ్వరం విచారణకు సమయం పడుతుంది... ఎందుకంటే?
x

కాళేశ్వరం విచారణకు సమయం పడుతుంది... ఎందుకంటే?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై పీసీ ఘోష్ నేతృత్వంలోని జుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అయితే ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో విచారణ పూర్తవడానికి సమయం పడుతుందని స్పష్టం చేసింది.


కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై పీసీ ఘోష్ నేతృత్వంలోని జుడిషియకాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై పీసీ ఘోష్ నేతృత్వంలోని జుడిషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అయితే ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో విచారణ పూర్తవడానికి సమయం పడుతుందని స్పష్టం చేసింది.ల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అయితే ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో విచారణ పూర్తవడానికి సమయం పడుతుందని స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ మేడగడ్డను సందర్శించారు. నేడు ఇరిగేషన్ అధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించింది. అనంతరం జలసౌధలో ఘోష్ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాళేశ్వరంపై విచారణ వేగవంతం చేశామని, ఇప్పటికే ప్రాజెక్టును పరిశీలించామని, రానున్న రోజుల్లో అన్ని విషయాలు బయటకి వస్తాయన్నారు.

"నెల రోజుల వ్యవధిలో 54 ఫిర్యాదులు వచ్చాయి.. వాటిని విచారణ చేస్తాం. ఫిర్యాదులో నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఏజెన్సీలను పిలుస్తున్నాము. విచారణ చేస్తున్నాం. నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్దా అన్ని విధాలుగా సమాచారం తీసుకుంటున్నాం. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదు ఇంకా సమయం పడుతుంది. విచారణ వేగంగా జరుగుతుంది" అని ఘోష్ వెల్లడించారు.

"మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది అందుకే కొంత ఆలస్యం అయ్యింది. ఇవ్వాళ 7 మందికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాము. రేపు 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాము. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, ఇరేగులర్, ఆర్థిక, అంశాల పై విచారణ మొదలు అవుతుంది. ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులు అన్ని అందాయి. వాటిపై కూడా పరిశీలన జరుగుతుంది. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేము" అని పీసీ ఘోష్ స్పష్టం చేశారు.

Read More
Next Story