రేవంత్ నుండి జనాలు చాలా ఎక్కువగా ఆశిస్తున్నారా ?
రేవంత్ పదిరోజుల అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. పదిరోజుల పర్యటనలో రేవంత్ మొదటగా న్యూయార్కులో ప్రవాస తెలుగువాళ్ళు, భారతీయులతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి విదేశీ ప్రయాణాలంటేనే పెట్టుబడుల కోసం లేకపోతే ఏదైనా అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకే అయ్యుంటుంది. ఇపుడు రేవంత్ పదిరోజుల అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. పదిరోజుల పర్యటనలో రేవంత్ మొదటగా న్యూయార్కులో ప్రవాస తెలుగువాళ్ళు, భారతీయులతో సమావేశమయ్యారు. తర్వాత న్యూజెర్సీ, వాషింగ్టన్ లో కూడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం అవబోతున్నారు. వాషింగ్టన్ లో ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో పాటు ప్రముఖ ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్ విజిట్ చేసి అధినేత సత్యానాదెళ్ళతో భేటీ కాబోతున్నారు. అలాగే గూగూల్ సీఈవో సుందర్ పిచ్చాయ తదితరులతో సమావేశమవుతారు.
అక్కడినుండి దక్షిణ కొరియాకు వెళతారు. అక్కడ శాంసంగ్ లాంటి అనేక దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ అవబోతున్నారు. సరే, పదిరోజుల పర్యటన తెలంగాణాకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది వేరే సంగతి. ముందయితే పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయాలి కాకబట్టి రేవంత్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనాలు రేవంత్ పర్యటనపై చాలా ఆశలే పెట్టుకున్నట్లున్నారు. రేవంత్ పర్యటనను ఉద్దేశించి నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఎలాగంటే కొత్తగా ఏమైనా పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకురావాలని కోరారు. ఇదివరకు ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలనే ఇపుడు కొత్తగా చూపించవద్దని అహ్మద్ షహబాజ్ ఖాన్ కోరారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఏమైనా ఇన్వెస్ట్ మెంట్స్ వస్తున్నాయా అని పి. యశ్వంత్ అనే నెటిజన్ డైరెక్టుగా రేవంత్ ను ట్విట్టర్లో ప్రశ్నించారు. పెట్టుబడులన్నీ హైదరాబాద్ కు మాత్రమే తీసుకొచ్చి తెలంగాణాను డెవలప్ చేశామని అంటే ఎలాగంటు ప్రశ్నించారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొస్తేనే కదా మొత్తం తెలంగాణా డెవలప్ అయినట్ల అని అడిగారు.
హైదరాబాద్ డెవలప్మెంట్ నే మొత్తం తెలంగాణా డెవలప్మెంటుగా పాలకులు చెప్పకూడదని యశ్వంత్ సూచించారు. నెటిజన్ల స్పందనలు, సూచనలు చూస్తుంటే రేవంత్ తో పాటు గతంలో పాలకులు చేసిన విదేశీ పర్యటనలను ఎంత జాగ్రత్తగా ఫాలో అవుతున్నారో అర్ధమవుతోంది. మరి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా అమెరికా, దక్షిణకొరియాలో పర్యటిస్తున్న రేవంత్ ఏమిచేస్తారో చూడాలి.