
ఫార్మా సిటి, ఫ్యూచర్ సిటీలను రద్దు చేయాలి.
‘రైతుల జీవితాలను ఛిద్రం చేసే ఇలాంటి సిటీలు అభివృద్ధి ఎలా అవుతాయి’
తెలంగాణ పీపుల్స్ జేఏసీ (Telangana Peoples' Joint Action Committee) ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు బుధవారం నాడు హైదరాబాద్ సమీపంలో ఏర్పాటుచేయాలనుకున్న ఫార్మా సిటీ (Pharma City) గ్రామాల్లో పర్యటించి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీ గా వచ్చారు. ఈ ఫార్మాసిటీకి తమ భూముల ఇవ్వలేమని లగచర్ల తదితర గ్రామాల ప్రజాలు ఆందోళన చేయడం ఫార్మాసిటి ప్రతిపాదను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇపుడు అక్కడి భూముల చుట్టూ ప్రభుత్వం కంచె వేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఫలితంగా మళ్లీ రైతులలో ఆందోళన మొదలయింది. ఈ నేపథ్యంలో పీపుల్స్ జెఎసి సభ్యులు ఇక్కడ పొలాలు, ఊర్లు, వ్యవసాయం చూసారు.
హరైతులతో, రైతు కూలీలతో మాట్లాడి ఇక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. అటు పిమ్మట, కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా ఫెన్సింగ్ వేసిన ప్రాంతాలు సందర్శించారు. తర్వాత మీడియా తో మాట్లాడుతూ, ఇంత సుభిక్షమైన ప్రాంతంలో ఏదో పేరు చెప్పి కంపెనీలు తెస్తాం అంటూ ప్రజల భూములు లాక్కుని వారిని రోడ్డున పడేయటం అన్యాయం అన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ అసలు ఇది అభివృద్ధి ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Dr. వనమాల గారు మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంతం కాన్సర్ మయం అయ్యింది, ఇక్కడ ఇంత స్వచ్ఛమైన వాతావరణం లో బ్రతుకుతున్న వారి మధ్య కాలుష్య కంపెనీలు పెట్టడం దారుణం అన్నారు.
అడ్వకేట్ సాదిక్ అలీ మాట్లాడుతూ ఒక పక్క రాజ్యాంగాన్ని రక్షిస్తాం అని రాహుల్ గాంధీ అంటున్నారు, మరి వారి ముఖ్య మంత్రి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా కోర్టు ఆర్డర్లని ధిక్కరిస్తూ భూములకి ఫెన్సింగ్ వేయిస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలిమిటి ? ఇప్పుడు చేస్తున్నాదేమిటి? అని రవి కన్నెగంటి ప్రశ్నించారు. 2013 చట్టం తెస్తాము, ఫార్మా సిటీ రద్దు చేస్తాము అన్నారు. కానీ అవేది చేయకుండా, కోర్టులో ఫార్మా ఉందని, బయట లేదని చెప్పటం ప్రజలని మోసం చేస్తున్నారని విమర్శించారు.
మీరా సంఘ మిత్ర మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. మరి ఇప్పుడు పవర్ లో కి వచ్చాక తిరిగి ఆ చట్టం తేవటం చాలా తేలిక, అది వారి చేతిలో పని. కానీ ఆలా చెయ్యకుండా, ఇది వరకు ఫార్మా కోసం తీసుకున్న భూములు ఫ్యూచర్ సిటీ కి మార్చటం చట్ట వ్యతిరేకం అన్నారు. ప్రజలకి పూర్తి వివరాలు ఇయ్యకుండా, భయ పెట్టి భూములు లాక్కుని, భూసేకరణ జరిగిపోయింది అనటం కరెక్ట్ కాదు. ఇది అసలు నిజమైన భూసేకరణ కాదు అని అన్నారు.
APCR రాష్ట్ర కన్వీనర్ Dr. ఉస్మాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలని ఇట్లా మోసం చెయ్యటం తగదని, వారు ప్రజలకి న్యాయం చెయ్యాలని, వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన విరమించుకుని, భూసేకరణ రద్దు చెయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు :
Professor హరగోపాల్ (కన్వీనర్, తెలంగాణ పీపుల్స్ జేఏసీ) రవి కన్నెగంటి (కో కన్వీనర్ (తెలంగాణ పీపుల్స్ జేఏసీ ) డా. వనమాల (విశ్రాంత ప్రొఫెసర్ ) మీరా సంఘ మిత్ర (ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ), అడ్వకేట్ సాదిక్ అలీ , వై.అశోక్ కుమార్, బి .కొండల్ రెడ్డి, రవిచంద్ర, (తెలంగాణ పీపుల్స్ జేఏసీ ), Dr. ఉస్మాన్ (అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ సివిల్ రైట్స్ ), నర్సింహ (మానవ హక్కుల వేదిక ), జ్యోతి, శ్రీదేవి (చైతన్య మహిళా సంఘం). ప్రొఫెసర్ విజయ్ (సెంట్రల్ యూనివర్సిటీ )
Next Story