
సంగారెడ్డి మహిళలు స్కైవారియర్స్..
మన్ కీ బాత్‌లో తెలంగాణ మహిళలను ప్రశంసించిన ప్రధాని మోదీ.
తెలంగాణ సంగారెడ్డి మహళా రైతులపై ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు. వాళ్లు వ్యవసాయంలో డ్రోన్లను వినియగించడాన్ని మోదీ ప్రస్తావించారు. ఇది వ్యవసాయ రంగంలో వచ్చిన అద్భుతమైన మార్పుగా పేర్కొన్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొంది.. పండ్ల తోటలపై పురుగుల మందులు ఇతర అవసరాల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. డ్రోన్ దీదీలను 'స్కై వారియర్స్' అని మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగానే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వల్ల కలిగే లాభాలాను కూడా ఆయన ివరించారు. డ్రోన్త వినియోగం వల్ల పిచికారీ చాలా వేగంగా పూర్తవుతుందని చెప్పారు. సాంప్రదాయా పద్దతులతో పోల్చుకుంటే ఒకరోజులో చేసే పనిని డ్రోన్ల సహాయంలో గంటల వ్యవధిలోనే చేయొచ్చని, అంతే సమర్థవంతంగా కూడా పని జరుగుతుందని పేర్కొన్నారు. నీటిని, మందుల వినియోగాన్ని 30-40 శాతం తగ్గించొచ్చని చెప్పారు. సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం.. ఈ టెక్నాలజీని గ్రామీణ స్థాయికి చేరువచేయడంలో కీలక ముందడుగా మోదీ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం డ్రోన్ ఫర్ అగ్రికల్చర్’ పథకం కింద మహిళా గ్రూప్‌లకు రాయితీతో డ్రోన్లను అందిస్తోందని మోదీ వివరించారు. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణా కేంద్రాలు, డ్రోన్ లైసెన్సింగ్ సదుపాయాలను కూడా కేంద్రం అందిస్తోందని వివరించారు మోదీ.