బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..
x

బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.


బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఆయనను శుక్రవారం అరెస్ట్ చేశారు. శనివారం ఆయనను వరంగల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సుబేదారీ పోలీసు స్టేషన్‌ నుంచి ఎంజీఎం వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కౌశిక్‌రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సుబేదారి పోలీసు స్టేషన్‌ వద్ద భారాస శ్రేణులు ఆందోళన చేశారు. కౌశిక్‌రెడ్డిని కలిసేందుకు వినయ్‌భాస్కర్‌, ఇతర నేతలు యత్నించారు. భారాస నేతలను పోలీసు స్టేషన్‌ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వినయ్‌భాస్కర్‌ వాగ్వాదానికి దిగారు.

Read More
Next Story