
ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్..
400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారికి ఏలేటి మహేశ్వర్ మద్దతు తెలిపారు.
బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్న బీజేవైఎం నేతలకు మద్దతు పలకడానికి ఏలేటి.. అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే అసలు తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ఏలేటి మహేశ్వర్ ప్రశ్నించారు. రోడ్లపై తిప్పి తనను అసెంబ్లీ దగ్గర వదిలేశారని అన్నారు. ‘‘నన్ను అదుపులోకి తీసుకుని రెండు గంటల పాటు రోడ్లపై తిప్పి అసెంబ్లీ ఆవరణలో వదిలేయడానికి వచ్చారు పోలీసులు. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి’’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసుల వాహనంలోనే ఆయన బైఠాయించారు.
అయితే 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారికి ఏలేటి మహేశ్వర్ మద్దతు తెలిపారు. దీంతో ఆయనను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలోనే కూర్చుని ఏలేటి నిరసన తెలుపుతున్నారు. అంతేకాకుండా అదుపులోకి తీసుకున్న బీజేవైఎం నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.