ఐబొమ్మ రవికే ‘బొమ్మ’ చూపిస్తున్న పోలీసులు
x
Police nabbed I Bomma organizer Ravi

ఐబొమ్మ రవికే ‘బొమ్మ’ చూపిస్తున్న పోలీసులు

శనివారం ఉదయం సడెన్ గా పోలీసులు ఒక ఇంటిపై దాడిచేసి రవిని అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులను, సినిమా ఫీల్డును సంవత్సరాలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు శనివారం ఉదయం అరెస్టుచేశారు. ఫ్రాన్స్ నుండి రవి శుక్రవారం హైదరాబాద్ కు రవి చేరుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. రవి హైదరాబాదులో ఎక్కడ ఉంటున్నాడనే విషయాన్ని పోలీసులు ఆరాతీశారు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ జరగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు కొందరు పోలీసు అధికారులను ప్రత్యేకించి రవి ఆచూకీ తెలుసుకోవటంపైనే ఉంచారు. మొత్తంమీద రవి కుకట్ పల్లిలో ఉంటున్న విషయాన్ని గుర్తించారు. శనివారం ఉదయం సడెన్ గా పోలీసులు ఒక ఇంటిపై దాడిచేసి రవిని అదుపులోకి తీసుకున్నారు.

రవి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. రవి వల్ల ఇబ్బందిపడని సినిమా ప్రముఖులు లేరు. ఏదైనా కొత్తసినిమా రిలీజ్ అవటం ఆలస్యం అదేరోజు హెచ్ డీ ప్రింట్ పైరసీ కాపీ ఐబొమ్మ వెబ్ సైట్లో ప్రత్యక్షమయ్యేది. సినిమా రిలీజయిన రోజు హెచ్ డీ ప్రింట్ క్వాలిటీతో పైరసీ కాపీ వెబ్ సైట్లో ఎలాగ అప్ లోడయ్యేదో సినిమా వాళ్ళు ఎంత తలలు బాదుకున్నా అర్ధమయ్యేదికాదు. కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొత్త సినిమాలు వెబ్ సైట్లో ప్రత్యక్షమయ్యేవి. దీనివల్ల నిర్మాతలు కోట్లరూపాయలు నష్టపోయారు. హెచ్ డీ క్వాలిటీలో వెబ్ సైట్లో ఉచితంగా సినిమా చూడగలుగుతున్నపుడు ఇక వందల రూపాయలు టికెట్లుకొన్ని థియేటర్లకు ఎంతమంది వెళతారు ? అందుకనే ఈ వెబ్ సైట్ కు కూడా జనాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

ఈ వెబసైట్ మీద నిర్మాతలు ఎంతమంది పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఉపయోగంలేకపోయింది. అందుకనే వెబ్ సైట్ నిర్వాహకుడితో పాటు ఇతర వెబ్ సైట్లను ఉద్దేశించి పోలీసులు పెద్ద వార్నింగే ఇచ్చారు. దాంతో ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులపై రెచ్చిపోయాడు. దమ్ముంటే పట్టుకోమని చాలెంజ్ చేశాడు. తనను ముట్టుకుంటే ఏమవుతుందో చెప్పలేనని చెప్పాడు. ఎంతమంది పోలీసులు ఎంత ప్రయత్నించినా తనను కనుక్కోవటం చేతకాదని సవాలు విసిరాడు. పోలీసులు హెచ్చరించినా ఉపయోగంలేకపోవటంతో చివరకు ఐబొమ్మను బ్యాన్ చేశారు. అయితే ఐబొమ్మ స్ధానంలో నిర్వాహకుడు బొప్పం.టీవీ రూపంలో ప్రత్యక్షమయ్యాడు.

ఇంతకుముందుకన్నా బొప్పం.టీవీ రూపంలో మరింతగా రెచ్చిపోయాడు. వెబ్ సైట్ ను బ్యాన్ చేస్తే మరోరూపంలో ప్రత్యక్షమవుతానని చెప్పాడు. ఒకవిధంగా వెబ్ సైట్ వల్ల సినిమా ఫీల్డుకు సుమారు రు. 2 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనా. కొన్ని వేలసినిమాల హెచ్ డీ ప్రింట్ల పైరసి కాపీలు వెబ్ సైట్లో ఉండేవి. సినిమాలు ఉచితం కావటంతో సబ్ స్ర్రైబర్లు కూడా పెద్దఎత్తున ఉండేవారు. కొత్త సినిమా అలా రిలీజ్ అవటం ఆలస్యం ఐబొమ్మ లేదా బొప్పం.టీవీలో హెచ్ డీ ప్రింట్ పైరసీ కాపీ ఇలాగ రిలీజైపోయేది. గంటల వ్యవధిలోనే హెచ్ డీ ప్రింట్ పైరసీ కాపీలను వెబ్ సైట్లో నిర్వాహకుడు ఎలా పెట్టేవాడో ఎవరికీ అంతుచిక్కటంలేదు.

సంవత్సరాల తరబడి అటు పోలీసులను ఇటు సినిమా నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతున్న నిర్వాహకుడు ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఇక్కడ అందరినీ బాగా ఇబ్బందిపెడుతున్నట్లు పోలీసులు కనుక్కున్నారు. అయితే ఏ దేశంలో ఉన్నాడో కనుక్కోలేకపోయారు. ఈనేపధ్యంలోనే నిర్వాహకుడిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసును జారీచేయించారు. అన్నీ ఎయిర్ పోర్టుల్లో నిర్వాహకుడు రవి ఫొటోతో పాటు వివరాలను కూడా ఉంచారు. ఈ సమయంలో రవి హైదరాబాదుకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిజానికి నిర్వాహకుడిపేరు రవి అన్న విషయాన్ని పోలీసులు అతికష్టంమీద కనుక్కున్నారు.

రవి హైదరాబాదుకు వస్తున్న విషయం తెలియగానే పోలీసులు అలర్టయ్యారు. రవి కదలికలపై నిఘాఉంచారు. అయితే పోలీసులకు తెలీకుండా రవి ముందుజాగ్రత్తపడి ఎయిర్ పోర్టు నుండి బయటకు వచ్చేశాడు. దాంతో పోలీసులు మరింత పట్టుదలగా రవి ఆచూకీ కోసం నిఘాపెట్టి నగరమంతా గాలించి మొత్తంమీద కుకట్ పల్లిలో ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు ఉదయం సడెన్ గా రవి ఉంటున్న ఇంటిపైన దాడిచేసి పట్టుకున్నారు.

పోలీసుల ద్వారా వచ్చిన సమాచారం ఏమిటంటే రవి ఫ్రాన్స్ నుండి హైదరాబాదుకు వచ్చాడు. కరేబియన్ దీవుల్లో ఉంటు పైరసి వ్యవహారాన్ని నడిపేవాడు. భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్నాడు. అరెస్టయినపుడు రవి ఖాతాలో ఉన్న రు. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ప్రాధమిక విచారణ తర్వాత నిర్వాహకుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Read More
Next Story