సిగాచి కంపెనీ సీఈఓ అరెస్ట్..
x

సిగాచి కంపెనీ సీఈఓ అరెస్ట్..

సిగాచి సంస్థ సీఈఓ అమిత్‌రాజ్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.


సిగాచి సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 30, 2025న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ సంస్థలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా జరిగిన పేలుడులో దాదాపు 54మంది మరణించారు. కాగా ఈ కేసులో బాధితుల కుటుంబాలకు సిగాచి సంస్థ నష్టపరిహారం ఇంకా పూర్తిగా చెల్లించలేదు. అతి తక్కువ మందికి పరిహారం అందినప్పటికీ అది ప్రకటించిన మొత్తం కాదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి అనే అంశాలపై విచారణ చేస్తున్న పోలీసులు శనివారం సంస్థ సీఈఓ అమిత్‌రాజ్‌ సిన్హాను అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

అసలు ఏం జరిగింది..

సిగాచి ఇండస్ట్రీస్‌లో 30 జూన్ 2025 సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఇది మైక్రోక్రిస్టలైన్ సెల్యులోస్ (MCC) డ్రైయర్ యూనిట్‌లో సంభవించింది. ఈ యూనిట్ ఫార్మసీ, సౌందర్య, ఆహార పరిశ్రమలలో బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించే MCCని ఉత్పత్తి చేస్తుంది. పేలుడు ఫలితంగా నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది, దీనిలో 143 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు ధృవీకరించారు. ప్రమాద సమయంలో 90 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది కార్మికులు బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా నుంచి వలస వచ్చినవారు.

బాధితులకు ఇంకా అందని పరిహారం..

ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించారు. కానీ ఆ పరిహారం ప్రకటనల్లో తప్ప చేతల్లో కనిపించలేదు. దీంతో బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఇంకా పరిహారం అందలేదని స్పష్టం చేశారు. ఈ కేసు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. కాగా సిగాచి సంస్థ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు బాధితులకు పూర్తి పరిహారం అందించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో తాజాగా సిగాచి సంస్థ సీఈఓ అరెస్ట్ కావడం కీలకంగా మారింది.

Read More
Next Story