డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న ఆయన ఇంట్లో చోరీ చేసిన నిందితులను పోలీసులు తాజా అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న ఆయన ఇంట్లో చోరీ చేసిన నిందితులను పోలీసులు తాజా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ పశ్చిమబెంగాల్ పోలీసులు ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు అందించిన సమచారం మేరకు వారు నిందితులను గుర్తించినట్లు సమాచారం. కాగా ప్రస్తుుతం వారిని తెలంగాణ తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇంటి నుంచి సదరు దొంగలు.. రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విశేశీ కరెన్సీ కొంత దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రోషన్ కుమార్, ఉదయ్ కుమార్ ఠాకూర్ ఇద్దరూ కూడా బీహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే వారు ఇంటి దొంగలా లేక బయట నుంచి వచ్చిన వారా అన్న ప్రశ్న తెగ వినిపిస్తోంది. బయట నుంచి వచ్చిన వారైతే డిప్యూటీ సీఎం ఇంటికి ఇంత పేళవమైన భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. అదే సమయంలో ఈ దొంగతనం భట్టి విక్రమార్క.. అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో జరగడం కూడా కీలకంగా మారుతోంది. ఆయన ఇక్కడ లేకపోవడం వల్లే భద్రత పల్చబడిందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించలేదు. మరోవైపు వారిద్దరూ కూడా భట్టి విక్రమార్క నివాసంలోనే పనిచేసేవారై ఉంటారని, లేని పక్షంలో ఒక డిప్యూటీ సీఎం ఇంట్లోకి చొరబడి.. దొంగతనం చేయడం అసంభవమన్న వాదన కూడా వినిపిస్తోంది.
అంతేకాకుండా డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం చేసి.. వారు పశ్చిమ బెంగాల్ చేరుకునే వరకు పోలీసులు ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం జరిగితేనే.. నిందితులు పశ్చిమబెంగాల్ పారిపోవచ్చు అంటే ఇక సామాన్యుడి ఇంట్లో చోరీ చేస్తే సదరు దొంగ ఖండాలు కూడా దాటి పోయినా పట్టుకోరీ పోలీసలు అంటూ మరికొందరు పోలీసులపై నిష్టారం వ్యక్తం చేస్తున్నారు.