Casino
x

ఫార్మ్ హౌస్‌లో క్యాసినో ముఠా అరెస్ట్

64 మంది అరెస్ట్. రూ.30లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం.


గ్రేటర్ పరిధిలో జరుగుతున్న పలు అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బెట్టింగ్‌లు, రేసింగ్‌లు వంటి పాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు, చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ఫార్మ్ హౌస్‌లో కోళ్లపందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో క్యాసినో, కోళ్ల పందాలు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో రాజేంద్రనగర్ డీసీపీ బృందం 64 మందిని అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా రూ.30లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకుంది. 86 పందెం కోళ్లు, 46 కోడికత్తులు పెద్దమొత్తంలో బెట్టింగ్ కాయిన్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ కోడి పందాలు, క్యాసినోలో కొందరు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్యాసినోను ముఠా పక్కాగా నిర్వహిస్తోంది. ఫార్మ్ హౌస్‌ను భారీ క్యాసినో హబ్‌గా మార్చేశారు. ఈమేరకు పక్కా సమాచారం అందడంతో బృందంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్న నిర్వాహకులు, పందాల రాయుళ్లను ప్రస్తుతం విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. వీటిలో పాల్గొన్న ప్రముఖులను కూడా పక్కా సాక్షాలు సంపాదించి విచారించే దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Read More
Next Story