గ్రూప్-1 అభ్యర్థుల నిరసన.. పరిగెత్తించిన కొట్టిన పోలీసులు
x

గ్రూప్-1 అభ్యర్థుల నిరసన.. పరిగెత్తించిన కొట్టిన పోలీసులు

గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి అశోక్ నగర్‌లో నిరసనకు దిగారు. రోడ్డెక్కి ఆందోళన చేయడం ప్రారంభించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసేవరకు తాము నిరసన చేస్తామంటూ నినాదాలు చేశారు.


గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి అశోక్ నగర్‌లో నిరసనకు దిగారు. రోడ్డెక్కి ఆందోళన చేయడం ప్రారంభించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసేవరకు తాము నిరసన చేస్తామంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని డిమాండ్లు చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడ తీవ్రంటా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రూప్-1 అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితె ఎంతకీ అభ్యర్థులు వినకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మాట వినకుండా మొండిగా ఎదురు తిరిగిన గ్రూప్-1 అభ్యర్థులు పరుగులు తీయించి మరీ పోలీసులు లాఠీలను పని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిని పలువురు తప్పుబడుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గ్రూప్-1 అభ్యర్థులు నిరసన చేస్తుంటే.. అధికారం ఉంది కదా అని పోలీసులను ఆయుధాలుగా మర్చుకుని వారిపై దాడి చేయండం ఈ ప్రభుత్వానికి తగదంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గ్రూప్-1 అభ్యర్థులు ఫైల్ చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు నిర్ణయంతో గ్రూప్-1 మెయిన్స్‌కు మార్గం సుగమం కావడంతోనే అభ్యర్థులు రోడ్డెక్కారు.

కోర్టు తీర్పిదే..

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో సింగిల్ బెంచ్ తీసుకున్న తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. దీంతో తెలంగాణలో ఈనెల 21న అంటే సోమవారం నాడు గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించడానికి మార్గం సుగమం అయింది. కోర్టు నిర్ణయంతో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారామే జరగనున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి హాల్‌టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులంతా మెయిన్స్ రాయనున్నారు. ఈ మెయిన్స్ పరీక్షలను హెచ్ఎండీఏ పరిధిలో నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే ఒక్కరోజు ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ మెయిన్స్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులంతా కూడా పరీక్ష మొదలుకావడానికి 30నిమిషాల ముందే సెంటర్లకు చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు అభ్యర్థులను సెంటర్ల లోపలకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఎన్ని పరీక్ష కేంద్రాలంటే..

గ్రూప్-1 మయిన్స్ పరీక్షలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్‌లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 46 కేంద్రాల్లో 31,383 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రతి కేంద్రంలో పరీక్ష హాల్, సూపరింటెండెంట్ గది, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, టీజీపీఎసో్సీ కార్యాలయ కమాండ్కంట్రోల్ కేంద్రం నుంచి వీటిని పర్యవేక్షించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని, మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటి వరకు 90 శాతం మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెప్తునస్నాయి. ఈ హాట్‌టికెట్లను 20వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

Read More
Next Story