
అప్పుల వసూలు చేసే బాధ్యత పోలీసులది కాదు:హైకోర్టు
అన్యాయం జరిగితే సివిల్ కోర్టుకు వెళ్లొచ్చు
అప్పు వసూలు చేసే బాధ్యత పోలీసులది కాని హైకోర్టు (Telangana High Court) తీర్పు చెప్పింది. అప్పు ఇవ్వని వ్యక్తిపై సివిల్ కోర్టులో దావావేసుకునే హక్కు బాధితుడికి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని జస్టిస్ టి. వినోద్ కుమార్ ధర్మాసనం తీర్పు చెప్పింది.
తన దగ్గిర అప్పు చేసిన ఒక వ్యక్తి తనను మోసం చేశాడని సతీష్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. అయితే, పోలీసులు స్పందించడం లేదని కనీసం ఎఫ్ ఐ ఆర్ ( First Information Report :FIR) కూడా నమోదు చేయలేదని, తనకు రావలసి డబ్బును వసూలు చేసిపెట్టాలని పోలీసులను ఆదేశించవలసిందిగా సతీష్ హైకోర్టునాశ్రయించారు. విచారణచేసిన హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రైవేటు డబ్బులావాదేవీలలో అప్పులు వసూలు చేసి పెట్టాలని పోలీసులను పోలీసులను కోర్టు ఆదేశించడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకవేళ ఆదేశిస్తే, పోలీసుల పాత్ర అప్పులు వసూలు చేసే ఏజంట్ స్థాయికి దిగిజారిపోతుందని, అది పోలీసు విధుల్లో లేదని, అది చట్టసమ్మతం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు."ఇలాంటి వ్యవహారాలలో పోలీసు జోక్యం సరైంది కాదు. ప్రవేటు అప్పులను వసూలు చేసిపెట్టడమనేది పోలీసుల బాధ్యతల్లో కాదు," అని కోర్టు స్పష్టం చేసింది.
నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట
గత బిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ధర్నా చేపట్టిన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద చేపట్టిన ధర్నాలో 8 మంది అభ్యర్థులపై గత ప్రభుత్వం కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. వారిపై నమోదైన కేసులను కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ తీర్పు చెప్పారు. ఈ తీర్పు పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.