
భూ వివాదం కేసులో రాజీవ్ కనకాలకు పోలీసు నోటీసులు
సినీ నిర్మాత కెపి చౌదరి కేసులో విచారణకు హాజరుకావాలని
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల రియల్ ఓ భూ వివాదం కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సినీ నిర్మాత విజయ్ చౌదరి తమను మోసం చేసినట్లు బాధితులు ఆరోపించడంతో ఈ కేసులో రాజీవ్ కనకాల విచారణకు రావాలని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ పోలీసులు ఈ నోటీసులు జారి చేశారు.పెద్ద అంబర్ పేట మున్సిపాలిటి పరిధిలోని పసుమామూల రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లో వివాదాస్పద ప్లాట్ల విక్రయంలో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై ఆరోపణలున్నాయి. విజయ్ చౌదరికి గతంలో రాజీవ్ కనకాల వివాదాస్పద స్థలాన్ని విక్రయించారు. తర్వాత ఇదే స్థలాన్ని విజయ్ చౌదరి మరో వ్యక్తికి రూ 70 లక్షలకు విక్రయించారు. లేని స్థలాన్ని ఉన్నట్లు విక్రయించిన ఆరోపణలపై విజయ్ చౌదరిపై హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ స్థలం విక్రయం కేసులో మోసం జరిగిందని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావల్సిందిగా హయత్ నగర్ పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు జారి చేశారు. తన ఆరోగ్యం బాగా లేదని విచారణకు తర్వాత హాజరవుతానని రాజీవ్ కనకాల పోలీసులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది.