
నార్సింగ్ లో హెరాయిన్ స్వాధీనం
రాజస్థాన్ నుంచి దిగుమతి
మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. హైద్రాబాద్ శివారు నార్సింగ్ లో ఎస్ వోటీ పోలీసులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. కోటి పది లక్షల రూపాయల విలువ చేసే హెరాయిన్ ను పోలీసులు పట్టుకున్నారు. దీని బరువు 650 గ్రాముల వరకు ఉంటుంది.
హెరాయిన్ రాజస్థాన్ నుంచి హైద్రాబాద్ కు దిగుమతి అయ్యింది. రాజారాం అనే వ్యక్తి దీన్ని సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
హైద్రాబాద్ లో మాదకద్రవ్యాలకు అడ్డాగామారింది. నార్సింగ్ ప్రాంతం లో విలాస వంతమైన ప్రాంతాల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
గత నెలలో సికింద్రాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్న ఘటన మరువకముందే గతవారం హైద్రాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాప్ట్ వేర్ ఇంజినీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే వారంలో ఎనిమిది మందితో కూడిన డ్రగ్స్ ముఠా ఒకటి పట్టుబడింది. గత వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ అనే టీమ్ ఎప్పటికీ నిఘాపెడుతుందని చెప్పారు.