హోంమంత్రి బండికే షాకిచ్చిన పోలీసులు
x
Central Home minister Bandi Sanjay

హోంమంత్రి బండికే షాకిచ్చిన పోలీసులు

గురువారం సాయంత్రం సభకు అనుమతి ఇచ్చి తాజాగా రద్దుచేయటంపై బండి(Bandi Sanjay)తో పాటు బీజేపీ(Telangana BJP) నేతలు పోలీసులపై మండిపోతున్నారు.


పోలీసులా మజాకానా తమతో పెట్టుకుంటే ఎవరినీ లెక్కచేసేది లేదని మరోసారి నిరూపించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సభకే అనుమతి రద్దుచేశారు. గురువారం సాయంత్రం సభకు అనుమతి ఇచ్చి తాజాగా రద్దుచేయటంపై బండి(Bandi Sanjay)తో పాటు బీజేపీ(Telangana BJP) నేతలు పోలీసులపై మండిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే జూబ్లీహిల్స్(Jubilee Hills by poll) అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. అందుకనే మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రచారం పీక్సుకు చేరకుంటున్నది. మూడుపార్టీల తరపున స్టార్ క్యాంపెయినర్లు అభ్యర్ధుల తరపున నియోజకవర్గంలో రోడ్డుషోలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆధ్యర్యంలో ఈరోజు బోరబండలో మీటింగ్ జరిపేందుకు పోలీసులనుండి బీజేపీ అనుమతి తీసుకున్నది. అయితే సభకు ఇచ్చిన అనుమతిని రద్దుచేస్తున్నట్లు పోలీసులు బీజేపీకి ఈరోజు సమాచారం ఇచ్చారు. దాంతో బండితో పాటు బీజేపీ ఎన్నికల ఇంచార్జి ధర్మారావు మండిపోతున్నారు. తమపార్టీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేయటానికి మీటింగ్ పెట్టుకుంటే పోలీసులు ఎందుకు రద్దుచేశారో చెప్పాలని ధర్మారావు డిమాండ్ చేశారు. అనుమతి ఇచ్చి రద్దు చేయటం అంటే దీనివెనుక కుట్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభలకు అనుమతి ఇచ్చి తమ మీటింగ్ అనుమతిని మాత్రమే రద్దుచేయటం ఏమిటని నిలదీస్తున్నారు.

పోలీసులు మీటింగుకు అనుమతి రద్దుచేసినా సభయితే బోరబండలో అనుకున్న సమయానికే జరిగితీరుతుందని ధర్మారావు ప్రకటించారు. పార్టీ శ్రేణులంతా వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి మీటింగునే రద్దుచేయటం ఏమిటని పోలీసులను ధర్మారావు నిలదీశారు. సాయంత్రం సభకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. పోలీసులు-బీజేపీ వ్యవహారం చూస్తుంటే సాయంత్రం ఏదో పెద్ద గొడవే అయ్యుంట్లుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story