
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్
విచారణకు వచ్చి విస్మయం
తెలుగురాష్ట్రాల్లో ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 4 500 ఫోన్లను ట్యాపింగ్ చేసింది. ఎక్కువగా కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసింది. దుబ్బాక ఎన్నికల సమయంలో బిజెపి నేత ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందని ఆయన అధికారుల దృష్టికి లీసుకొచ్చారు. ఈ కేసులో బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత వారం విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. జర్నలిస్ట్ లు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం చివరకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లను కూడా వదల్లేదు. ఇందులో భాగంగా ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ చేసింది. ఈ నేపథ్యంలో ఆరా మస్తాన్ ను బుధవారం విచారణ అధికారులు పిలిచారు. ఉఫ ఎన్నికల సమయంలో ఆరా మస్తాన్ కాంగ్రెస్ నేతలతోచర్చించిన సంభాషణలు రికార్డు అయ్యాయి. ఆ రికార్డులు విన్న ఆరా మస్తాన్ విస్మయం వ్యక్తం చేశారు.