తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ సన్నద్ధం అయింది. ఈరోజే నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
Live Updates
- 13 May 2024 6:36 PM IST
తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్
సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపటికి క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం. ఒకటి రెండు ఘటనలు మినహాయిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. హైదరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాధవి లత పై కేసు నమోదు. జహీరాబాద్, నారాయణఖేడ్, నిజామాబాద్ లో పలు కేసులు నమోదు.
- 13 May 2024 6:10 PM IST
నిజామాబాద్ లో ముగిసిన పోలింగ్
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ముగిసింది. 1808 పోలింగ్ కేంద్రాల్లో 70శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. నిజామాబాద్ అర్బన్ లో అత్యల్పంగా 58శాతం నమోదైంది. ఇది ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 2019లో నమోదైన పోలింగ్ 68.31శాతంతో పోలిస్తే ఈసారి ఓటర్లు బాగానే ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు చెప్తున్నారు.
- 13 May 2024 5:57 PM IST
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదు.. ఆదిలాబాద్ -69.81 శాతం, భువనగిరి -62.34 శాతం, చేవెళ్ల -53.15 శాతం, హైదరాబాద్-39.17 శాతం, కరీంనగర్-67.67 శాతం, ఖమ్మం-70.76 శాతం, మహబూబాబాద్-68.60 శాతం, మహబూబ్‌నగర్-68.40 శాతం, మల్కాజిగిరి-46.27 శాతం, మెదక్-71.33 శాతం, నాగర్ కర్నూల్ -66.53 శాతం, నల్గొండ-70.36 శాతం, నిజామాబాద్-67.96 శాతం, పెద్దపల్లి-63.86 శాతం, సికింద్రాబాద్ -42.48 శాతం, వరంగల్-64.08 శాతం, జహీరాబాద్-71.91 శాతం నమోదు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 47.88 శాతం పోలింగ్
- 13 May 2024 5:48 PM IST
ఆదిలాబాద్ లో 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం..69.81%
ఆదిలాబాద్ ..69.82%
బోథ్..74.8%
నిర్మల్ జిల్లా..69.03%
ముధోల్ ..72.73%
ఖానాపూర్..67.02%
సిర్పూర్...68.14 %
అసిఫాబాద్..67.21%
- 13 May 2024 5:45 PM IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటల వరకు నమోదు అయినా పోలింగ్ శాతం..61.16%
అత్యధిక పోలింగ్ అయిన పార్లమెంట్ - భువనగిరి 72.34%
ఆత్యల్పంగా పోలింగ్ అయిన పార్లమెంట్ - హైదరాబాద్ 39.17%
అదిలాబాద్ 69.81%
భువనగిరి 72.34%
చేవెళ్ల 53.15%
హైద్రాబాద్ 39.17%
కరీంనగర్ 67.67%
ఖమ్మం 70.76%
మహబూబాబాద్ 68.60%
మహబూబ్నగర్ 68.40%
మల్కాజిగిరి 46.27%
మెదక్ 71.33%
నాగర్ కర్నూల్ 66.53%
నల్గొండ 70.36%
నిజామాబాద్ 67.96%
పెద్దపల్లి 63.86%
సికింద్రబాద్ 42.48%
వరంగల్ 64.08%
జహీరాబాద్ 71.91%
సికింద్రాబాద్ కంటోన్మెంట్(బై ఎలక్షన్) 47.88%
- 13 May 2024 5:02 PM IST
లోక్ సభ ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న చేవెళ్ల లోక్ సభ బిజెపి అభ్యర్థి..
- 13 May 2024 4:51 PM IST
జూబ్లీ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్, ఉపాసన. "అందరూ బయటకు రండి.. ఓటు హక్కు వినియోగించుకోండి.. యువకులు అధికంగా ఓటు వేయాలి.. ఆదర్శంగా నిలవండి" -రామ్ చరణ్
- 13 May 2024 4:18 PM IST
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు ముగిసిన పోలింగ్.. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల పోలింగ్.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముగిసిన పోలింగ్.
- 13 May 2024 3:53 PM IST
రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి ప్రెస్ మీట్ పెట్టి మరి బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలపై తప్పుడు ప్రచారం చేసారని ఆరోపిస్తూ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.