ప్రమాదం అంచున చెరువులు...పొంచి ఉన్న ప్రమాదాలు
x
కామారెడ్డి జిల్లాలో పారుతున్న వరదనీరు

ప్రమాదం అంచున చెరువులు...పొంచి ఉన్న ప్రమాదాలు

అతి భారీవర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.


కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో బీబీపేట పెద్ద చెరువు వరదనీటితో నిండు కుండలా మారింది. ఈ చెరువు నీరు కొట్టమీదకు వచ్చింది. ఈ చెరువు కట్టపై నుంచి పారుతున్న నీరు కట్ట తెగితే కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం లోని షేరి పల్లి,తుజాల్ పూర్ కు,మెదక్ జిల్లా నిజాం పేట మండలం లోని రాంపూర్,నందగోకులం గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. కట్ట తెగితే ఊర్లకు ముంచి ఉన్న ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పొంచి ఉన్న ప్రమాదంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.




పోచారం ప్రాజెక్టు అలుగు పక్కన గండి

మెదక్ జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరింది.దీంతో పోచారం ప్రాజెక్టు ప్రమాదం అంచున ఉంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అలుగు పక్కన భారీ గండి పడింది.దీంతో వృధాగా నీరు పోతుంది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.




కామారెడ్డి- హైదరాబాద్ రహదారి బంద్
వరదనీటి ప్రవాహంతో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు.జంగంపల్లి వద్ద భారీ వరద నీరు హైవేపైకి పొంగిపొర్లుతుంది. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

వరద ప్రాంతాల్లో ప్రజలకు డ్రోన్‌ల ద్వారా ఆహారం
అప్పర్ మానేరు ప్రాజెక్ట్‌లో చిక్కుకున్న ప్రజలకు డ్రోన్‌ల ద్వారా విమానాల ద్వారా ఆహార సామాగ్రిని సరఫరా చేశారు. గంభీరావుపేట మండలంలోని అప్పర్ మానేరు ప్రాజెక్ట్ సమీపంలో చిక్కుకున్న వారికి డ్రోన్‌లను ఉపయోగించి అవసరమైన ఆహార పదార్థాలను పంపిణీ చేసినట్లు రాజన్న సిరిసిల్ల కలెక్టరు సందీప్ కుమార్ ఝా ,ఎస్పీ మహేష్ బి.గీతే తెలిపారు.పశువులను మేపడానికి నర్మల సమీపంలోని ప్రాజెక్ట్ మీదుగా వెళ్లిన ఐదుగురు వ్యక్తులు వరదల కారణంగా చిక్కుకుపోయారని వారు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని మోహరించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.డ్రోన్ డెలివరీ ద్వారా తక్షణ ఆహార అందిస్తున్నారు.

కామారెడ్డిలో విద్యాసంస్థలకు రేపు సెలవు
కామారెడ్డి జిల్లాలో గురువారం విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో సెలవు మంజూరు చేసినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ చెప్పారు. వర్షాలు కురిసే జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా సీనియర్ ఐఏ.ఎస్ అధికారులను నియమించారు.మెదక్ జిల్లాకు ప్రత్యేకాధికారిగా జెన్కో ఎండీ హరీష్ ను నియమించారు. సచివాలయంలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.



అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిళ్లకుండా ఉండేందుకు గాను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. వరదల నుండి కాపాడుకోవడం తో పాటు నీటివనరుల పరిరక్షణ ప్రభుత్వానికి ప్రాధాన్యాతాంశంగా పరిగణించాలని మంత్రి సూచించారు.



Read More
Next Story