
ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
నల్గొండ జిల్లా నకిరేకల్ లో బిఆర్ఎస్ పై ఫైర్
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంత్రి పొంగులేటి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఇదిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసిన పొంగులేటి గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
డబుల్ బెడ్ రూంలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గానికి 3, 500 ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి 20 లక్షల ఇళ్లు కేటాయిస్తామని మంత్రి హమి ఇచ్చారు. మొదటి విడత 4, 50 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వచ్చే ఎన్నికల నాటికి 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి హామి ఇచ్చారు .దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలో పైసలు జమచేస్తామన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బిఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే ఇళ్ల పట్టాలిచ్చిందన్నారు. కుల, మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిస్తుందన్నారు.
Next Story