Caste Census | ‘ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం’.. ప్రజలకు పొన్నం ప్రభాకర్ భరోసా
x

Caste Census | ‘ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం’.. ప్రజలకు పొన్నం ప్రభాకర్ భరోసా

తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి కులం వారికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.


తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి కులం వారికి న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం, న్యాయం అందించాలన్న ఉద్దేవంతోనే ఈ సర్వే చేపట్టామని వెల్లడించారు. ఈ సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. ‘‘భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ సర్వే ఒక రోడ్‌మ్యాప్‌లా పనిచేస్తుంది. భావితరాలకు న్యాయం చేయడానికి సమగ్రంగా వివరాలు సేకరించాం. బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి ఉంది. బీసీలకు న్యాయం చేయడానికి కావాల్సిన పథకాలపై ప్రతిపక్షాలు సూచనలు చేయాలి’’ అని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.

మాటకు కట్టుబడి ఉన్నాం

‘‘సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన నివేదిక సమగ్ర ఇంటింటి కుల సర్వే ఎన్నో ఒడిదుకులు ఎదురుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగింది. 1931 కి స్వాతంత్ర్యం కి ముందు కుల సర్వే జరిగింది. స్వాతంత్ర్యం తరువాత మళ్ళీ కుల సర్వే జరగలేదు. బలహీన వర్గాలకు మేమెంతో మాకంత ఉండాలని సమాచారం కులాల లెక్కలు లేక దాని ప్రకారమే ప్రభుత్వ పథకాల వచ్చేవి. భారత్ జోడో యాత్ర లో మా నాయకుడు రాహుల్ గాంధీ.. దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు ప్రాతినిధ్యం లేదు వారికి అవకాశాలు రావాలంటే ఎవరేంతో వారికి తెలవల్సిందే అని ఎన్నికల్లో చెప్పడం జరిగింది. టిపీసీసీ పక్షాన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కి చైర్మన్‌గా ఉన్నాను. బలహీన వర్గాలపై స్పష్టంగా మా విధానం చెప్పడం జరిగింది.. ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని వివరించారు.

ప్రతీది రాజకీయం చేయకండి

‘‘ఫిబ్రవరి 4 క్యాబినెట్ సమావేశం జరిగింది ,16 న శాసన సభలో తీర్మానం చేసుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. లక్ష మంది ప్రభుత్వం ఉద్యోగులతో ఈ సర్వే చేసి సమాచారాన్ని సెకరించాం. 1931 నుండి సమాచారం లేదు.. బలహీన వర్గాలకు సంబంధించి మీరు ఇంకా న్యాయం చేయాలనుకుంటే సలహాలు సూచనలు చెప్పండి. బలహీన వర్గాల శాఖ మంత్రిగా వాటన్నిటిని బలహీన వర్గాల అభివృద్ధికి తీసుకుపోతాం. ప్రతిదీ రాజకీయం చేసినట్టు.. బలహీన వర్గాల ఆకాంక్షలను రాజకీయం చేయకండి. తెలంగాణ అన్ని జిల్లాలో స్వేచ్చగా తమ ఆకాంక్ష ముందుకు తీసుకుపోవాలి. ఈ సమాచారాన్ని తీసుకొని భవిషత్ లో ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడతుంది’’ అని చెప్పారు.

బలహీన వర్గాలకు ఒక అవకాశం

‘‘బలహీన వర్గాల అభివృద్ధికి ఈ రోజు నుండి శకం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్. తెలంగాణ దేశానికి దిక్సూచి. నిన్న రాహుల్ గాంధీ.. పార్లమెంటు లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుల సర్వే ప్రజా ప్రతినిధులకు గౌరవం అన్నారు. నివేదిక వచ్చిన తరువాత ముందుకు పోవడానికి రోడ్ మ్యాప్ తీసుకుపోవడానికి సభలో చర్చించుకొని భవిషత్ లో అందరికి మార్గదర్శకత్వం దొరుకుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు ఒక అవకాశం దొరుకుతుంది’’ అని వివరించారు.

పర్తి ఒక్కరికీ ధన్యవాదాలు

‘‘1986 లో మురళీధర్ రావు కమిషన్ వచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా, మాజీమంత్రి గంగుల కమలాకర్ ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కమిషన్ ఉద్యమంలో పాల్గొని నినదించాం. బావి తరాలకు న్యాయం జరగడానికి బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి మా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జీవితంలో నాకు గొప్ప కార్యక్రమం. మా నాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కమిటీ చైర్మన్‌గా మార్గదర్శకత్వం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర మంత్రులు రాజకీయ పార్టీల నాయకులకు బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అని అన్నారు.

భవిష్యత్తులో మార్పు కనిపిస్తుంది

‘‘ఇప్పటి వరకు లెక్కలే లేవు... లెక్కలు తక్కువ ఎలా వస్తాయి.. ఇప్పుడు జరిగిన లెక్కల కొలమానం భవిష్యత్‌లో మరోసారి సర్వే జరిగినప్పుడు మార్పు కనిపిస్తుంది. ప్రతి ఇంటికి వెళ్లి సహకరించిన సహకరించకపోయిన వారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా సమాచారాన్ని సేకరించాం. నివేదిక సబ్ కమిటీకి సమర్పించారు. సబ్ కమిటీ లో చర్చించి కేబినెట్ లో పెట్టింది. బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తుంది. 2011 జనాభా లెక్కల్లో ఆనాడు తెలంగాణ లో 3 కోట్ల 50 లక్షలు ఉండేది.. ఇప్పుడు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు. కేంద్రం నుండి జనాభా ప్రాతిపదికన దక్షిణ ,ఉత్తర భారతదేశానికి నిధులు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు’’ అని తెలిపారు.

సలహాలు, సూచనలు ఇవ్వండి

‘‘దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పాటించడం జనాభా తగ్గింది. 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టీ లక్ష మంది ఉద్యుగులతో ఈ ప్రక్రియ చేపట్టింది. సలహాలు సూచనలు ఇవ్వండి..సున్నితమైన అంశం. చాలా కాలంగా ఎంతో మంది మేదావులు, సంఘాలు , ఉద్యమకారులుఈ సర్వే కోసం ఉద్యమిస్తే రాహుల్ గాంధీ గారీ ఆలోచనకు అనుగుణంగా ఎవరెంతో వారంతా తెలవాల్సిందే అని ఈ సర్వే జరిగింది. బలహీన వర్గాలకు న్యాయం జరగాలి...రోడ్డు మ్యాప్ రావాలి.. వారికి అందే కార్యక్రమాలపై ఆలోచన చేయాలి. బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్నప్పుడు దానికి మించిన సంతోషం లేదు. అందరూ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా బలహీన వర్గాల బిడ్డలు స్వాగతిస్తూ సలహాలు సూచనలు ఇవ్వండి’’ అని కోరారు.

చారిత్రాత్మక నిర్ణయం

‘‘బలహీన వర్గాలకు న్యాయం జరగలేనే దానికన్నా మించిన సంతోషం ఇంకోటి ఉండదు. బలహీన వర్గాల మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజు. 10 సంవత్సరాలుగా కావాలనే ఉద్యమకారులు స్వాగతించాలి. గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బలహీన వర్గాల బిడ్డగా, సబ్ కమిటీ సభ్యుడిగా, డిక్లరేషన్ చైర్మన్‌గా, బలహీన వర్గాల మంత్రిగా కుల సర్వే తీర్మానం ప్రవేశ పెట్టే అదృష్టం కలిగింది. మన వర్గాలకు అన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం.. అందరూ సలహాలు సూచనలు ఇవ్వండి’’ అని అడిగారు.

Read More
Next Story