ఎస్ఎల్బీసీ రెస్య్కూలో గుడ్ న్యూస్..కరెంట్ వచ్చింది
x
SLBC Tunnel

ఎస్ఎల్బీసీ రెస్య్కూలో గుడ్ న్యూస్..కరెంట్ వచ్చింది

శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్(ఎస్ఎల్బీసీ) టన్నెల్లో ఉన్నతాధికారులు విద్యుత్ ను పునరుద్ధరించారు


శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్(ఎస్ఎల్బీసీ) టన్నెల్లో ఉన్నతాధికారులు విద్యుత్ ను పునరుద్ధరించారు. టన్నెల్లో పనులు జరుగుతుండగా శనివారం ఉదయం పెద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుపనులు వేగంగా జరపటం కోసం జేపీ అసోసియేట్స్ సంస్ధ సొరంగానికి ఉన్న రెండు ఇన్ లెట్ అండ్ అవుట్ లెట్ మార్గాల్లో ఏకకాలంలో పనులు చేస్తున్నది. ఈ నేపధ్యంలోనే ఇన్ లెట్ మార్గంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. సొరంగం పై కప్పునుండి మట్టి, రాళ్ళు సుమారు 100 మీటర్ల మేర ఒక్కసారిగా రాలిపడటంతో ప్రమాదం జరిగింది. దాంతో ఒక్కసారిగా మట్టి, రాళ్ళు, బురద పేరుకుపోయింది. పై నుండి నీళ్ళు కూడా ఉధృతంగా రావటంతో టన్నెల్లో 14 కిలోమీటర్ల మేర అంతా నీరు, బురదతో నిండిపోయింది.

లోపల పనిచేస్తున్న 50 మందిలో 42 మంది అతికష్టంమీద టన్నెల్లో నుండి బయటపడగా మరో 8 మంది లోపలో చిక్కుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్ధితి ఏమిటో బయటున్న వాళ్ళకు అర్ధంకావటంలేదు. కారణం ఏమిటంటే 14 కిలోమీటర్ల మేర టన్నెల్(SLBC Tunnel) మొత్తం చీకటితో నిండిపోయింది. బురద, నీటితో టన్నెల్ నిండిపోవటంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దాంతో బయటనుండి అధికారులు లోపల పరిస్ధితిని అధ్యయనం చేసేందుకు ద్రోన్లను పంపినా ఉపయోగంలేకపోయింది. ఎందుకంటే ద్రోన్లు కూడా 12 కిలోమీటర్ల వరకే వెళ్ళగలిగాయి. మిగిలిన 2 కిలోమీటర్ల దూరాన్ని ద్రోన్లు కూడా ప్రయాణంచేయలేక వెనుదిరిగాయి. దాంతో ఆ రెండు కిలోమీటర్ల దూరంలో ఏమి జరిగిందన్న విషయంలో సమాచారం అందటంలేదు. 14 కిలోమీటర్లలో ఆదివారం ఉదయం నుండి అధికారులు, రెస్క్యూ టీములు 12 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగినా ముందుకు వెళ్ళటం సాధ్యంకాక మళ్ళీ వెనక్కువచ్చేశారు.

ఈ నేపధ్యంలోనే నానా అవస్ధలుపడిన అధికారులు టన్నెల్లోపల విద్యుత్(Power restored) ను పునరుధ్ధరించగలిగారు. టన్నెల్లో ట్యూబ్ లైట్ల కోసం భారీ జనరేటర్లున్నాయ. అయతే ప్రమాదం కారణంగా జనరేటర్లు(Generators) దెబ్బతిన్నాయి. దాంతో ఒక్కసారిగా విద్యుత్ నిలిచిపోయింది. ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించటమే టార్గెట్ గా విద్యుత్ రంగ నిపుణులు, డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు, మిలిటరీ నిపుణులు అంతా కలిసి ముందుగా టన్నెల్లో విద్యుత్ ను పునరుద్ధరించగలిగారు. 14 కిలోమీటర్లలో పేరుకపోయిన బురద, రాళ్ళు, మట్టిని యుద్ధప్రాతిపదకన తొలగిస్తున్నారు. శనివారం రాత్రే చాలావరకు బురద, రాళ్ళు, నీటిని బయటకు తీస్తున్నారు.

అన్నీ ప్రయత్నాలూ చేస్తున్నాం

టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని క్షేమంగా బయటకు తీసుకురావటానికి ప్రభుత్వం అన్నీవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, మిలిటరీ నిపుణులు, డిజాస్టర్ రెస్సాన్స్ అధికారులు శనివారం నుండి బాధితులను రక్షించేపనిలో ఉన్నట్లు చెప్పారు. టన్నెల్లోని నీటిని బయటకు పంపేందుకు భారీ మోటార్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ మొత్తానికి విద్యుత్ ను కూడా పునరుద్ధరించినట్లు మంత్రి వివరించారు. కొండపై నుండి ర్యాట్ హోల్ పద్దతిలో టన్నెల్లోకి చేరుకోవాలంటే 400 మీటర్లు తవ్వాలని నిపుణులు చెప్పినట్లుగా మంత్రి తెలిపారు. అయితే ప్రాక్టికల్ గా అధిసాధ్యంకాదని కూడా నిపుణులు తేల్చినట్లు ఉత్తమ్ చెప్పారు.

Read More
Next Story