బస్సులోనే కాన్పు చేసిన కండక్టర్
x

బస్సులోనే కాన్పు చేసిన కండక్టర్

ఓ లేడీ కండక్టర్ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి డెలివరీ చేసి, అదే బస్సులో తల్లీ, బిడ్డను క్షేమంగా ఆసుపత్రికి తరలించారు.


విధి నిర్వహణలో ఉన్న ఓ లేడీ కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి డెలివరీ చేసి, అదే బస్సులో తల్లీ, బిడ్డను క్షేమంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శుక్రవారం హైదారాబాద్ లో జరగగా... విషయం తెలిసిన ప్రతిఒక్కరూ కండక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం ఆరంఘర్ నుంచి సికింద్రాబాద్ వస్తోంది.

ఇదే బస్సులో నిండు గర్భిణీ ప్రయాణిస్తోంది. ఆమెకి సడెన్ గా నొప్పులు మొదలయ్యాయి. గమనించిన కండక్టర్ సరోజ బస్సు పక్కన ఆపించి ప్రయాణికులను దింపేశారు. బస్సులో ఉన్న ఇతర మహిళల సహాయంతో గర్భిణికి బస్సులోనే పురుడు పోశారు. ఆ మహిళ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డల్ని అదే బస్సులో సురక్షితంగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, ఇతర ప్రయాణికులు కండక్టర్ ని అభినందించారు.

అభినందించిన సజ్జనార్...

బస్సులోనే ప్రసవం చేసి, తల్లీబిడ్డని క్షేమంగా ఆసుపత్రికి తరలించిన కండక్టర్ సరోజని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను TGSRTC ఎండీ వీసీ సజ్జనార్ అభినందనలు తెలియజేశారు. అప్రమత్తమైన సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు.

Read More
Next Story