అమెరికాలో నరకం చూపెడుతున్న తెలుగోళ్లు అరెస్ట్
x

అమెరికాలో నరకం చూపెడుతున్న తెలుగోళ్లు అరెస్ట్

అమెరికాలో పెద్దఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగోళ్లు అరెస్ట్ అయ్యారు.


అమెరికాలో పెద్దఎత్తున హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగోళ్లు అరెస్ట్ అయ్యారు. గిన్స్‌బర్గ్ లేన్‌ లోని ఒక ఇంటిలో అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది కంటే ఎక్కువ మంది యువతులను ప్రిన్‌స్టన్ పోలీసులు గుర్తించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ లో వందమందిపైగా చిక్కుకుని ఉండొచ్చని, వారిలో సగానికి పైగా బాధితులను గుర్తించామని పోలీసులు వెల్లడించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరింతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

అక్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ఈ ముఠా కొంతమంది యువతులను గిన్స్‌బర్గ్ లేన్‌ లో ఓ ఇంట్లో బందీగా ఉంచింది. ఇటీవల ఆ ఇంట్లో పురుగుల బెడద ఎక్కువగా ఉండడంతో పెస్ట్ కంట్రోల్ వారిని పిలిచారు. అక్కడికి వచ్చిన పెస్ట్ కంట్రోల్ కంపెనీ టీమ్ ఇంట్లో దుర్భర దృశ్యాలు చూసి ఖంగుతిన్నారు. ఆ ఇంట్లో ఫర్నీచర్ లేదు. కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్, అనేక సూట్ కేసులు, ఎక్కడపడితే అక్కడ దుప్పట్లు దర్శనమిచ్చాయి. దాదాపు డజనుకు పైగా యువతులు భయంకరమైన స్థితిలో నేలపైనే నిద్రిస్తుండటం చూసి షాకయ్యారు. దీంతో పెస్ట్ కంట్రోల్ టీమ్ కి అనుమానాలు తలెత్తాయి. వెంటనే విషయాన్ని ప్రిన్‌స్టన్ పోలీసులకు తెలిపారు.

గిన్స్‌బర్గ్ లేన్‌లోని సదరు నివాసానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా పరిశీలించారు. అక్కడున్నవారిని ఆరా తీయగా హ్యూమన్ ట్రాఫికింగ్ విషయం బయటపడింది. కేసులో నిందితులు చందన్ దాసిరెడ్డి (24), ద్వారకా గుండా (31), సంతోష్ కట్కూరి (31), అనిల్ మాలే (37) లను అరెస్ట్ చేశారు. నిందితులపై హ్యూమన్ ట్రాఫికింగ్, సెకండ్ డిగ్రీ నేరం కింద అభియోగాలు మోపారు.

పోలీసుల వివరాల ప్రకారం కట్కూరి, అతని భార్య ద్వారకా గుండాకు చెందిన వ్యక్తులు వివిధ షెల్ కంపెనీలలో పనిచేయమని బాధితులను బలవంతం చేశారని తెలిపారు. బాధితులు ప్రోగ్రామర్లుగా పనిచేస్తున్నారని తదుపరి విచారణలో వెల్లడైంది. అధికారులు అనేక ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, ప్రింటర్లు, ఫేక్ డాక్యుమెంట్స్ గిన్స్‌బర్గ్ లేన్ నివాసం నుండి, మెలిస్సా, మెకిన్నేలోని ఇతర ప్రదేశాల నుండి స్వాధీనం చేసుకున్నారు.

Read More
Next Story