లైఫ్ జాకెట్లు లేకుండానే బోటింగ్  చేస్తూ ఇద్దరి మృతి
x

లైఫ్ జాకెట్లు లేకుండానే బోటింగ్ చేస్తూ ఇద్దరి మృతి

వికారాబాద్ సర్పన్ పల్లి ప్రాజెక్టులో ప్రయివేటు దందా


వికారాబాద్ సర్పన్ పల్లి ప్రాజెక్టులో నిబంధనలను ఉల్లంఘిస్తూ బోటింగ్ ఇద్దరు వ్యక్తులు నీళ్లలో పడి మునిగిపోయారు. బోటింగ్ , హుక్కా వంటి ప్రయివేటు దందాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. పర్వతగిరిమండలంలోని సర్పన్ పల్లి ప్రాజెక్టు టూరిస్ట్ లకు కేంద్రంగా ఉంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో రిసార్ట్ నిర్వాహకులు నీటిపారుదలా శాఖ జలాశయంలో బోటింగ్ నిర్వహిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా శనివారం బోటు బోల్తా కొట్టింది. బోటులో ప్రయాణిస్తున్న ఇద్దరు నీళ్లలోమునిగి అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు ముగ్గురిని కాపాడారు. మరో ఘటనలో ముగ్గురు నీళ్లలో మునిగిపోతుండగా స్థానికులు రక్షించారు. బోటింగ్ చేయాలంటే లైఫ్ జాకెట్లు అవసరం కానీ అటువంటి నిబంధనలను ఇక్కడ పాటించడం లేదు.

ప్రమాదం జరిగి ఇద్దరు నీళ్లలో మునిగిచనిపోయినప్పటికీ నిర్వాహకులు మాత్రం బోటింగ్, హుక్కా దందాను ఆపలేదు. హక్కా కేంద్రాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. అధికారులకు నిర్వాహకులకు మధ్య రహస్య ఒప్పందం ఉందని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదలా శాఖకు చెందిన భూములను ప్రయివేటు వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రిసార్ట్ కు సరైన అనుమతులు లేకున్నా అధికారులు మౌనం వహించడమేమిటని స్థానికులు ప్రశ్నించారు. ఓ వైపు పర్యాటకులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అధికారుల ఉలుకుపలుకూ లేదని పలువురు మండిపడుతున్నారు.

Read More
Next Story