మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం
x

మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం


హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే వరుస ఘటనలు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్-విజయవాడ హైవేపై విహారి ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. బస్సు సిబ్బంది వెంటనే అలెర్ట్ అయి ప్రయాణికులను అప్రమత్తం చేయడంలో వారంతా సురక్షితంగా బయట పడ్డారు.

40 మంది ప్రయాణికులతో విహారీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరుకు బయలుదేరింది. చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. తొలుత బస్సు అంతా పొగతో నిండిపోయింది. వెంటనే బస్సు సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దాంతో ప్రయాణికులంతా బస్సు నుంచి దిగిపోయారు. వారు దిగిన క్షణాల వ్యవధిలో బస్సు మంటల్లో దగ్దమైంది. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సు అంతా దగ్దం కాగా.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. కాగా అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు

Read More
Next Story