చేనేత పై జీఎస్టి కంపెన్సేషన్ కోసం తెలంగాణ ప్రత్యేక విధానం
x

చేనేత పై జీఎస్టి కంపెన్సేషన్ కోసం తెలంగాణ ప్రత్యేక విధానం

ఇది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సంధర్బంగా తెలంగాణ చేనేత రంగానికి ఇచ్చిన హామీ.


చేనేత పై జీఎస్టి కంపెన్సేషన్ కోసం తెలంగాణలో ప్రత్యేక విధానాన్ని రూపొందిద్దామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి *దీపా దాస్‌మున్షీ అన్నారు. మాజీ ప్రభుత్వ విప్ ఇరావత్రి అనిల్ కుమార్ తో కలిసి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న నేత బుధవారం రోజున గాంధీభవన్లో దీపా దాస్‌మున్షీ ని కలిశారు.

ఈ సందర్భంగా గతంలో రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్ర సందర్భంగా ఇచ్చిన జీఎస్టీ కంపన్సేషన్ గురించి *జీరో జిఎస్టి ఉద్యమం* గురించి సవివరంగా ఆమెకు వివరించడం జరిగింది.

దీనిపై దీపా దాస్‌మున్షీ స్పందిస్తూ జీఎస్టీ పన్ను కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కనుక మనము చేనేత కళాకారులకు ఇచ్చే ఐదు శాతం జీఎస్టీ పరిహారం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక విధానాన్ని రూపొందిద్దామని తెలిపారు.

ఈ మేరకు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరియు ఢిల్లీ పెద్దలతో చర్చించి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. జీరో జీఎస్టీ ఉద్యమంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖ పై ఇప్పటివరకు ఎంతమంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేశారనే విషయాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు.

Read More
Next Story