హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ భర్త.. రాజకీయకోణం కాదట!!
x

హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ భర్త.. రాజకీయకోణం కాదట!!

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కి వచ్చారు.


ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కి వచ్చారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని సందర్శించారు. అనంతరం ఆయన ఐటీసీ కోహినూర్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తన హైదరాబాద్ పర్యటన పై స్పందిస్తూ.. అనాధాశ్రమాలు, వికలాంగులను కలవడానికి వచ్చానని తెలిపారు. అలాగే కొన్ని ప్రార్థన మందిరాలకు కూడా వెళ్తానన్నారు.

నా ధార్మిక పర్యటనలలో దేశంలో సుఖశాంతులు నెలకొనాలని దేవుళ్ళను ప్రార్థిస్తానన్నారు వాద్రా. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా బాధాకరమన్నారు. దేశంలో మహిళలు చాలా సేఫ్ గా ఉన్నామని ఫీల్ అయ్యే రోజులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు. నా భార్య, కూతురు భద్రత విషయంలోనూ నాకు అప్పుడప్పుడు ఆందోళనగా ఉంటుందన్నారు. మహిళలు భద్రంగా ఉండాలంటే... ఇంట్లో మగవారికి మహిళలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలని సూచించారు.

"రాహుల్ గాంధీ, నేను ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాం. దేశంలోని సమస్యలను నేను రాహుల్ ఒకే కోణంలో చూస్తున్నాం. ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. ఐదేళ్ల తర్వాత ఆ మార్పు చూస్తారు. నేను ఆధ్యాత్మిక భావనతోనే హైదరాబాద్ కి వచ్చాను" అని వాద్రా తెలిపారు. ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీలో నేను పవర్ సెంటర్ కావడం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అన్నారు. నా భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడం నాకు సంతోషంగా ఉందన్నారు వాద్రా. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్న ఆయన.. రెండు మూడు రోజుల పటు ఇక్కడే ఉందనున్నట్టు స్పష్టం చేశారు. తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా, మసీదులను, దేవాలయాలను సందర్శిస్తానన్నారు. అనాథాశ్రమాలను, అభాగ్యులను కలుస్తాను అని చెప్పారు. ఇక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటాను అని చెప్పారు.

Read More
Next Story