ప్రముఖ గాయని సుశీల క్షేమం
x
Cine singer P Susila

ప్రముఖ గాయని సుశీల క్షేమం

మూడురోజుల క్రితం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన గాయని సోమవారం డిస్చార్జ్ అయ్యారు.


ప్రముఖ నేపథ్యగాయని పీ సుశీల క్షేమంగా ఉన్నారు. మూడురోజుల క్రితం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన గాయని సోమవారం డిస్చార్జ్ అయ్యారు. కడుపునొప్పి ఎక్కువయిపోవటంతో కుటుంబసభ్యులు సుశీలను హుటాహుటిన శుక్రవారం అర్ధరాత్రిపైన ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అన్నీ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు ట్రీట్మెంట్ చేశారు. ఆరోగ్యం కుదురుగా ఉన్నదని నిర్ధారించుకున్న తర్వాత సుసీలను డిస్చార్జి చేశారు.

ఇంటికి వచ్చిన మరుసటిరోజు సుశీల ఇదే విషయాన్ని తన అభిమానులతో వీడియో రూపంలో పంచుకున్నారు. దేవుడిదయ వల్ల తాను ఇపుడు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. అభిమానుల ప్రార్ధనలే తనను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని చేసినట్లు గాయని చెప్పారు. తన అనారోగ్యం విషయంలో ఎవరూ ఆందోళనపడాల్సిన అవసరంలేదని చెప్పారు.

86 ఏళ్ళ సుశీల యాబై ఐదేళ్ళ సినీ జీవితంలో తెలుగు, తమిళం, మళయాళం, కన్నడంతో పాటు సుమారు 10 భాషల్లో దాదాపు 45 వేలకుపైగా పాటలు పాడారు. వయసురీత్యా వచ్చిన సమస్యల కారణంగా చాలాకాలంగా సినిమాల్లో పాడటం మానేశారు. కొద్దిరోజులు ప్రైవేటు కార్యక్రమాల్లో పాడినా తర్వాత అది కూడా మానేసి కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైపోయారు. దగ్గరి బంధులు, సినీపరిశ్రమలోని ఆప్తులు, దగ్గరి స్నేహితులను తప్ప సుశీల ఇంకెవరినీ కలవటంలేదు.

Read More
Next Story