Allu Arjun Released| పుష్ప 7697 విడుదల
జైలుకు ఉన్న వెనుకగేటు ద్వారా అర్జున్ ను ఎస్కార్ట్ ఇచ్చి 6.50 గంటలకు అధికారులు బయటకు రిలీజ్ చేశారు.
పుష్ప అలియాస్ అల్లు అర్జున్ కాసేపటి క్రితం జైలునుండి రిలీజయ్యారు. శుక్రవారం సాయంత్రం నుండి చంచల్ గూడ(Chamchalguda Prison)లోని మంజరి బ్లాకులోనే అర్జున్ ఉన్న విషయం తెలిసిందే. అండర్ ట్రయల్ ఖైదీగా పరిగణించిన అల్లుఅర్జున్(Allu Arjun) కుజైలు అధికారులు 7697(Allu Arjun No 7697) నెంబర్ ను కేటాయించారు. పుష్ప(Pushpa Movie) అలియాస్ అల్లు అర్జున్ కు శుక్రవారం సాయంత్రం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. అయితే తనపైన నమోదైన కేసులను కొట్టేయాలని అర్జున్ దాఖలుచేసిన కేసును హైకోర్టు విచారించింది. కేసును కొట్టేయలేదుకాని నాంపల్లి విధించిన 14 రోజుల రిమాండును మాత్రం కొట్టేసింది. రిమాండును కొట్టేయటంతో బన్నీకి బెయిల్ దొరికింది.
హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చింది కాని అందుకు సంబంధించిన పత్రాలు చంచల్ గూడ్ జైలు అధికారులకు అందటంలో బాగా ఆలస్యం అయ్యింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ అధికారికంగా జైలు అధికారులకు అందాల్సుంటుంది. అప్పుడు మాత్రమే రిలీజ్ ఫార్మాలిటీస్ మొదలవుతాయి. బెయిల్ ఆర్డర్ కాపీని తాము జైలు అధికారులకు ఇచ్చినా రిలీజ్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా జైలులోనే ఉంచారని అల్లు అర్జున లాయర్ ఆరోపించారు. అయితే తాము జైలు నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు అధికారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలాగున్నా శనివారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో రిలీజ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. శనివారం తెల్లవారుజామున మాత్రమే బెయిల్ ఉత్తర్వులు అధికారికంగా జైలు అధికారులకు అందటంతో అప్పుడు రిలీజ్ ఆర్డర్ మొదలుపెట్టారు. ఏదేమైనా శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంజీరా బ్యారక్ లోని ప్రత్యేకంగా అర్జున్ ను ఉంచినట్లు లాయర్ చెప్పారు. తాజా పరిణామాలతో అర్జున్ శుక్ర, శనివారాలు రెండురోజులు జైలులో ఉన్నట్లయ్యింది. కాకపోతే ఇతర ఖైదీలతో కాకుండా ప్రత్యేకంగా ఉంచారు. అల్లుఅర్జున్ ను జైలు నుండి రిసీవ్ చేసుకోవటానికి లాయర్ నిరజంన్ రెడ్డితో పాటు తండ్రి అల్లు అరవింద్ కుటుంబసభ్యులు కూడా వచ్చారు. జైలుకు ఉన్న వెనుకగేటు ద్వారా అర్జున్ ను ఎస్కార్ట్ ఇచ్చి 6.50 గంటలకు అధికారులు బయటకు రిలీజ్ చేశారు.