
రాహుల్ గాంధీ బ్రాహ్మణుడే
రాహుల్ హిందుమతంలోని బ్రాహ్మణకులానికి చెందిన వ్యక్తిగా సర్టిఫికేట్ ఇచ్చేశారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి(Turpu Jagga Reddy) బల్లగుద్ది మరీచెప్పారు. నరేంద్రమోడీ(Narendra Modi) పుట్టుకతో అగ్రకులానికి చెందిన వ్యక్తని రేవంత్ రెడ్డి(Revanth) ఆరోపించిన విషయం తెలిసిందే. మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ ఆరోపించగానే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ ఎదురుదాడులు మొదలుపెట్టారు. మోడీ కులంగురించి రేవంత్ ఆరోపించగానే కిషన్, బండి ఇద్దరు రాహుల్(Rahul Gandhi) కులంగురించే కాకుండా మతంగురించి కూడా ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. మోడీ కులంగురించి, రాహుల్ మతం, కులంగురించి బహిరంగచర్చకు రావాలని కేంద్రమంత్రులు ఇద్దరు రేవంత్ కు చాలెంజ్ చేశారు.
కేంద్రమంత్రుల చాలెంజుకు స్పందనగా జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతు రాహుల్ హిందుమతంలోని బ్రాహ్మణకులానికి చెందిన వ్యక్తిగా సర్టిఫికేట్ ఇచ్చేశారు. రాహుల్ కులం, మతంగురించి ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరంలేదన్నారు. రాహుల్ జంధ్యం వేసుకోవటం చాలామంది చూసే ఉంటారని కూడా జగ్గారెడ్డి గుర్తుచేశారు. విచిత్రం ఏమిటంటే బ్రాహ్మణులు మాత్రమే జధ్యం వేసుకుంటారని జగ్గారెడ్డి అనుకుంటున్నట్లున్నారు. నాన్ బ్రాహ్మణుల్లోని కొన్ని కులాల వాళ్ళు కూడా జంధ్యం ధరిస్తారన్న విషయం జగ్గారెడ్డికి తెలుసో తెలీదో ?
రాజీవ్ గాంధీ(Rajiv Gandhi)ని వివాహంచేసుకున్న సోనియా(Sonia Gandhi) తర్వాత సోనియాగాంధీగా మారారని, సంజయ్ గాంధీని వివాహం చేసుకున్న సిక్కు యువతి మేనక ఆ తర్వాత మేనకాగాంధీగా మారిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ప్రియాంకగాంధి(Priyanka Gandhi) కూడా హిందువే అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయలబ్ది పొందాలని ప్రయత్నంచేయలేదన్నారు. తనకులాన్ని అడ్డుపెట్టుకుని లబ్దిపొందాల్సిన అవసరం కూడా రాహుల్ గాంధీ కుటుంబానికి లేదన్నారు. రాహుల్ కుటుంబంగురించి కిషన్(Kishan reddy), బండి(Bandi Sanjay) సవాలుకు స్పందించిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) మాట్లాడతు జాతీయస్ధాయిలో కులగణన చేసేటపుడు రాహుల్ ఇంటికి వెళ్ళినపుడు కులంగురించిన వివరాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.